Trump Mug shot: మగ్‌షాట్‌ ఫొటోతో చరిత్రకెక్కిన ట్రంప్.. అదే ఫొటోతో తొలి ట్వీట్.. సోషల్ మీడియాలో రికార్డ్!

ABN , First Publish Date - 2023-08-26T07:28:10+05:30 IST

2020లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నించారంటూ తనపై అభియోగాలున్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైల్లో లొంగిపోయారు. సుమారు 22 నిముషాల పాటు జైల్లో ఉన్న అనంతరం అధికారులు ఆయన్ను రూ. 1.65 కోట్ల పూచీకత్తుపై బెయిల్‌తో విడుదల చేశారు.

Trump Mug shot: మగ్‌షాట్‌ ఫొటోతో చరిత్రకెక్కిన ట్రంప్.. అదే ఫొటోతో తొలి ట్వీట్.. సోషల్ మీడియాలో రికార్డ్!

డొనాల్డ్‌ ట్రంప్‌, ఖైదీ నంబరు పి01135809!

మగ్‌షాట్‌ ఫొటోతో రెండున్నరేళ్ల తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి ట్వీట్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 25: 2020లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నించారంటూ తనపై అభియోగాలున్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ జార్జియాలోని ఫుల్టన్‌ కౌంటీ జైల్లో లొంగిపోయారు. సుమారు 22 నిముషాల పాటు జైల్లో ఉన్న అనంతరం అధికారులు ఆయన్ను రూ. 1.65 కోట్ల పూచీకత్తుపై బెయిల్‌తో విడుదల చేశారు. జైల్లో ఉన్నప్పుడు నిబంధనల ప్రకారం ట్రంప్‌నకు ఫొటో(మగ్‌ షాట్‌) తీశారు. ఈ క్రమంలో.. జైల్లో ఈ తరహా ఫొటో దిగిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్‌ అమెరికా పేజీలకెక్కారు. జైలు అధికారులు తనను తీసిన ఫొటోను ట్రంప్‌ ఎక్స్‌(ఒకప్పుడు ట్విటర్‌)యా్‌పలో అప్‌లోడ్‌ చేశారు. 2021, జనవరి 8 తర్వాత ఆయన మళ్లీ ట్విటర్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి.

‘ఎన్నికల్లో జోక్యం’, ‘ఎప్పుడూ లొంగిపోవద్దు’ అంటూ ఆ ఫొటోకు వ్యాఖ్యల్ని ఆయన జతచేశారు. అటు ఫుల్టన్‌ కౌంటీ జైలు విడుదల చేసిన ఫొటో కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఆరడుగుల మూడంగుళాల పొడవు, 97 కిలోల బరువు, తెల్లటి జుట్టు, నీలపు కళ్లు, ఖైదీ సంఖ్య పి01135809 అని దానిపై అధికారులు పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని విడుదల అనంతరం ట్రంప్‌ విలేకరులతో స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయడమనేది.. అమెరికాకు దుర్దినం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-26T07:28:55+05:30 IST