Foreign National: విదేశీ గ్రాడ్యుయేట్లకు కెనడా గోల్డెన్ ఆపర్చునిటీ..!
ABN , First Publish Date - 2023-03-18T12:37:48+05:30 IST
విదేశీ గ్రాడ్యుయేట్లకు (International Graduates) కెనడా ప్రభుత్వం గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది.

ఎన్నారై డెస్క్: విదేశీ గ్రాడ్యుయేట్లకు (International Graduates) కెనడా ప్రభుత్వం గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లను (Post Graduation Work Permit) మరో ఏడాదిన్నర పాటు పొడిగించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) కీలక ప్రకటన చేసింది. విదేశీ పోస్ట్ గ్రాడ్యుయేట్లకు సంబంధించి ఎవరివైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ల (PGWP) గడువు త్వరలో ముగియనుందో (లేదా) ఇటీవలే గడువు ముగిసిందో వారికి వర్క్ పర్మిట్ల (Work Permits) వాలిడిటీని పెంచుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇలా చేయడం ద్వారా గ్రాడ్యుయేట్లు మరింత కాలంలో కెనడాలోనే ఉండి, మరికొంత వర్క్ ఎక్స్‌పిరీయన్స్ పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపింది. దీనిలో భాగంగా ఏడాదిన్నర పాటు వర్క్ పర్మిట్ల గడువును పొడిగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కాగా, పీజీడబ్ల్యూపీ ప్రొగ్రాం (PGWP Program) అనే విదేశీ గ్రాడ్యుయేట్స్‌కు కెనడాలో వర్క్ పర్మిట్లు పొంది, కెనడియన్ పని అనుభవం సంపాదించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తాజాగా ప్రకటించిన 18 నెలల వర్క్ పర్మిట్ గడువు పొడిగింపు అనేది ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి అమల్లోకి వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విదేశీ గ్రాడ్యుయేట్లు (Foreign Graduates) సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదిలాఉంటే.. 2022 చివరి నాటికి కెనడాలో 2.86లక్షల మంది విదేశీ గ్రాడ్యుయేట్లు వాలీడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 1.27లక్షల పీజీడబ్ల్యూటీల గడువు 2023లో ముగియనుంది. మరో 67వేల మంది పీజీడబ్ల్యూటీ హోల్డర్లు ఇప్పటికే శాశ్వాత నివాసం (Permanent Residency) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి వర్క్ పర్మిట్ల గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: వామ్మో.. నిత్యానంద లీలలు మాములుగా లేవుగా.. ఏకంగా అమెరికాలోని 30 నగరాలకే ఎసరు..!