NRI BRS: లండన్‌లో ఘనంగా బీఆర్‌యస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2023-05-07T07:45:01+05:30 IST

లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్‌యస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్‌యస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

NRI BRS: లండన్‌లో ఘనంగా బీఆర్‌యస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

-ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం

లండన్: లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్‌యస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్‌యస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, విశిష్ట అతిథిగా ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. ముందుగా జయశకంర్ చిత్ర పటానికి పూలు వేసి, అమరవీరులని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బీఆర్‌యస్ పార్టీ జెండా ఎగరేసి, "దేశ్ కి నేత కేసీఆర్" అంటూ నినదించారు.

BBBBB.jpg

ఎన్నారై బీఆర్‌యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ.. పార్టీ నాయకులకు కార్యకర్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై బీఆర్‌యస్ సభ్యులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు పార్టీలో పని చేసే అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు కేసీఆర్ వెంట ఉన్నామో అలాగే నేడు కూడా దేశ గతిని మార్చే పోరాటంలో సైతం కేసీఆర్ వెంటే ఉంటామని అశోక్ తెలిపారు.

BB.jpg

ఎఫ్దీసి చైర్మన్ మరియు ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ బీ.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావం ఒక చరిత్ర అని, ఒక నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకై బయలుదేరిన గులాబీ జెండా నేడు కెసిఆర్ గారి నాయకత్వంలో దేశ నలుమూలల ఎగరాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని, తెలంగాణ మోడల్ దేశమంతా కావాలని ఆకాంక్షిస్తున్నారని అనిల్ అన్నారు. మనం కలలు కన్న తెలంగాణ ను కేసీఆర్ అహర్నిశలు కష్టపడి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని, మన అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్ళీ రాబోయే ఎన్నికల్లో బీఆర్‌యస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. దీనికోసం మనమంతా మన బాధ్యత నిర్వహించాలని కోరారు. తప్పకుండా బీఆర్‌యస్ పార్టీ వంద సీట్లు గెలిచి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలవడం ఖాయమని అనిల్ జోస్యం చెప్పారు.

BBB.jpg

కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఖండాతరాల్లో ఉంటూ నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర సాధన కోసం ఎన్నారైలంతా క్రియాశీలకంగా పనిచేశారని, వారి కృషిని బాధ్యతను అభినందించారు. ఇక్కడ వాతావరణం సైతం లెక్క చెయ్యకుండా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి క్షేత్రస్థాయిలోని నాయకులకు, ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చారని ప్రశంసించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఎన్నారై ఆడబిడ్డలు మన బతుకమ్మను బోనాలను కూడా మరువకుండా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అభినందించారు.

BBBBBBB.jpg

కార్యవర్గ సభ్యులే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఉత్సాహంగా బీఆర్‌యస్ పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీ పట్ల, కేసీఆర్ పట్ల మీకున్న అభిమానం చాలా గొప్పగా ఉందని తెలిపారు. ఉద్యమ సమయం నుండి కేసీఆర్ వెంటే ఉన్నాని ఎన్ని కష్టాలు వచ్చినా కేసీఆర్ ఎత్తిన జెండా కింద పెట్టకుండా, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయ్యకుండా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు.

BBBBBB.jpg

నేడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలో మొదటి స్థానంలో ఉందని, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఏదైనా తెలంగాణ మోడల్ దేశానికి దిక్సూచిగా మారిందని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఉదాహరణకు తాము ఊరులో వెళ్ళినప్పుడు కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నప్పుడు ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషం వేస్తుందన్నారు. కేసీఆర్ మాకు పెద్ద దిక్కు లెక్క, ఒక మేన మామ లెక్కనా పెళ్లి చేస్తున్నట్లు చెప్తుంటారని తెలిపారు. ఇలా ప్రతి పథకం కేసీఆర్ ఎంతో బాధ్యతతో ప్రవేశపెట్టారని, ఇలాంటి ప్రభుత్వాన్ని, పార్టీని మనమంతా కాపాడుకోవడంతో పాటు కేసీఆర్‌కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు ఎన్నారై బీఆర్‌యస్ నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

BBBB.jpg

చివరిగా ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎమ్మల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎఫ్‌డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ వేడుకల్లో ఎన్నారై బీఆర్‌యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు ఉపాధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ముఖ్యనాయకులు సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్, సతీష్ రెడ్డి బండ, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, సురేష్ బుడగం, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మాదిరెడ్డి నవీన్ రెడ్డి, ప్రశాంత్, సురేష్ గోపతి, ప్రశాంత్ మామిడాల, మధు యాదవ్, ప్రవాస సంఘాల నాయకులు గణేష్ కుప్పం, రంజిత్, స్వాతి బుడగం, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శ్రావ్య, విద్య, స్నేహ, పావని, మాధవ్, దీపాక్షర, రవి కిరణ్, వంశీ తదితరులు పాల్గొన్నవారిలో ఉన్నారు.

B.jpg

Updated Date - 2023-05-07T07:46:32+05:30 IST