Share News

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!

ABN , First Publish Date - 2023-10-13T12:55:29+05:30 IST

ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది.

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!

Air India: ప్రముఖ దేశీయ విమానయానా సంస్థ ఎయిరిండియా (Air India) యూరోప్‌లోని ఐదు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు ఎయిరిండియా తాజాగా బంపరాఫర్ (Bumper Offer) ప్రకటించింది. ఆ ఐదు యూరోపియన్ నగరాలకు భారీ తగ్గింపు ధరలతో విమాన సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. ఇక ఎయిర్ ఇండియా చాలా చౌకగా విమాన సర్వీసులు (Flight Services) నడపనున్నట్లు ప్రకటించిన ఆ ఐదు నగరాల జాబితాలో లండన్, కోపెన్‌హాగన్, మిలన్, పారిస్, వియన్నా ఉన్నాయి. కాగా, ఈ విమాన సర్వీసులలో ప్రారంభ ధరలు వచ్చేసి వన్-వేకి రూ.25వేలు, రౌండ్ ట్రిప్‌కు రూ.40వేలుగా ఉంటాయని ఎయిరిండియా యాజమాన్యం తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ధరలతో విక్రయించే టికెట్లు ఒక పరిమిత కాలానికి మాత్రమే. కనుక మీకు ఆ ఐదు యూరోపియన్ నగరాలను (European Cities) చుట్టేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇకపోతే ఈ ఐదు నగరాలకు వెళ్లే విమాన సర్వీసులు కేవలం ఎకానమీ క్లాస్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మీరు 'వన్-వే' లేదా 'రౌండ్ ట్రిప్' కోసం టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఢిల్లీ, ముంబై నుంచి ఈ ఐదు నగరాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడపనుంది. ప్రతివారం 48 నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ఉంటాయి. కాగా, ఈ 'లిమిటెడ్-టైమ్ సేల్' (Limited-Time Sale) కింద అందించే విమాన టికెట్ల ధరలు మీరు బయలుదేరే నగరం, వర్తించే మారకపు రేట్లు, పన్నుల ఆధారంగా కొద్దిగా మారవచ్చు. ఈ ప్రత్యేక సేల్ కోసం బుకింగ్‌లు ఈ నెల 14వ తేదీ వరకు ఓపెన్ అయి ఉంటాయి. అలాగే ఈ సేల్ కింద అందించే ప్రత్యేక డిస్కౌంట్ టికెట్లతో ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు ప్రయాణాలు చేయవచ్చు. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ (www.airindia.com) లేదా మొబైల్ యాప్‌లు లేదా అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా విమాన టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చు.

UAE: గోల్డెన్ వీసాతో కలిగే ఎనిమిది అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..

Updated Date - 2023-10-13T12:56:00+05:30 IST