TANA: తానా మహాసభలకు నందమూరి బాలకృష్ణ.. టీజర్‌ విడుదల..

ABN , First Publish Date - 2023-05-24T20:29:13+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ మేరకు..

TANA: తానా మహాసభలకు నందమూరి బాలకృష్ణ.. టీజర్‌ విడుదల..

ఫిలడెల్ఫియా (అమెరికా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో (Philadelphia) జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హాజరుకానున్నారు. ఈ మేరకు మహాసభల నిర్వాహకులు టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి మాట్లాడుతూ మహాసభలకు రావాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు.. బాలకృష్ణను కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలపై బాలయ్య అభినందనలు తెలియజేసినట్లు చెప్పారు.

AMERICA-TANA.jpgతానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మర్యాదపూర్వకంగా బాలకృష్ణను కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించిన బాలకృష్ణ, డిసెంబర్‌ 2022లో బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని తానా ద్వారా అందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మహాసభలకు బాలయ్య రాక ప్రవాస తెలుగువారందరికీ మంచి అనుభూతి కలిగిస్తుందని 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలియజేసారు. ఎన్టీఆర్‌ శతవసంతోత్సవాలు జరుగుతున్న తరుణంలో తానా మహాసభలకు బాలకృష్ణ హాజరవడం.. ఎన్టీఆర్‌ (NTR) అభిమానులను మరింత సంతోషపెడుతోందని చెప్పారు. తానా బోర్డ్‌ సభ్యుడు జాని నిమ్మలపూడి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి వేడుకలు వచ్చేందుకు సమ్మతించిన బాలకృష్ణ, వసుంధర దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. తానా బాలకృష్ణ టీజర్‌ను పార్లమెంట్‌ సభ్యుడు రామ్మోహన్‌ నాయుడు (MP Rammohan Naidu) చేతుల మీదుగా విడుదల చేశారు.

TANA.jpg

Updated Date - 2023-05-25T19:20:31+05:30 IST