Eating food: ఏ ఆహార పదార్థాలను రోజులో ఏ సమయంలో తినాలో తెలుసా..! సరిగా టైం పాటించకపోతే.. !

ABN , First Publish Date - 2023-05-16T15:06:42+05:30 IST

ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరిపోతుంది.

Eating food: ఏ ఆహార పదార్థాలను రోజులో ఏ సమయంలో తినాలో తెలుసా..! సరిగా టైం పాటించకపోతే.. !
dinner and bedtime

మామూలుగా ఇప్పటి రోజుల్లో అందరిలో కనిపించే సమస్య ఊబకాయం, ఈ ఊబకాయంతో బరువు తగ్గాలనుకునేవారు చక్కని ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఆహారాన్ని ఏ వేళలో ఎప్పుడు ఎలాంటి సమయాల్లో తీసుకోవాలనే విషయంలో అవగాహన అవసరం. బరువు తగ్గడం, వ్యాయామం చేయడం వంటి విషయాల్లో జాగ్రత్తలు. ఏ సమయంలో తినాల్సిన ఆహారాన్ని అదే సమయంలో తీసుకోవడం కూడా అంతే అవసరం. లేదంటే పోషకాహారం తీసుకున్నా తగిన ఫలితం ఉండదు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏయే ఆహార పదార్థాలను రోజులో ఎప్పుడు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు…

పెరుగును పగటి పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట తినకూడదు. అలా తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పెరుగును పగటి పూటే తినాలి. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

అన్నం…

రాత్రి పూట అన్నం అస్సలు తినకూడదు. దీని వల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. మధ్యాహ్న భోజనంగా అన్నం తినాలి. దీని వల్ల శరీరంలో ఉన్న కార్బొహైడ్రేట్లన్నీ ఎక్కువగా వినియోగమయ్యేందుకు అవకాశం ఉంటుంది.

పాలు…

పాలను రాత్రి పూట తీసుకుంటే మంచిది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోకూడదు. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు ఉదయం పూట పాలను తాగవచ్చు.

ఇది కూడా చదవండి: పిల్లల్లో బుద్దిమాద్యం ఉన్నదని గుర్తించడం ఎలా? వైద్య శాస్త్రం ఏం చెబుతుంది?

యాపిల్స్…

యాపిల్ పండ్లను ఉదయాన తినాలి. దీని వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. రాత్రి పూట యాపిల్స్‌ను తినడం మంచిది కాదు. ఒక వేళ తింటే జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.

వాల్‌నట్స్…

వాల్‌నట్స్‌ను సాయంత్రం తినాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరిపోతుంది. అదే ఉదయం, రాత్రి పూట అయితే వీటిని తినకూడదు. ఎందుకంటే ఆయా సమయాల్లో వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవు.

పప్పు ధాన్యాలు…

శనగపప్పు, పల్లీలు, కంది పప్పు, చిక్కుడు తదితర గింజ, పప్పు జాతికి చెందిన ధాన్యాలను మధ్యాహ్నం పూట

Updated Date - 2023-05-16T15:06:42+05:30 IST