Breakfast Foods: ఉదయం టిఫిన్‌గా ఈ ఐదు తింటుంటే అర్జెంట్‌గా మానేయండి.. లేకపోతే..

ABN , First Publish Date - 2023-05-24T13:26:49+05:30 IST

చక్కెర, పిండి పదార్ధాల ప్రమాదం లేకుండా ఆరోగ్యాన్ని అందిస్తాయి.

Breakfast Foods: ఉదయం టిఫిన్‌గా ఈ ఐదు తింటుంటే అర్జెంట్‌గా మానేయండి.. లేకపోతే..
Paneer or cottage cheese

ఉదయాన్నే ఖాళీ కడుపుని అల్పాహారంతో నింపేస్తూ ఉంటాం. కానీ వీటికి మన ఆరోగ్యానికి లింక్ ఉంటుందనే మాట మరిచిపోతుంటాం. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం విషయంలో మనం పాటించాల్సిన నియమాలేమన్నా ఉన్నాయా? అసలు ఉదయం తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాల గురించి చూడండి.

అల్పాహారం కోసం ఏమి తినాలి?

ఇది మనలో చాలా మంది ఆలోచించే ప్రశ్న. మనలో కొందరు ఉదయం పూట గుడ్లు, సాసేజ్‌లు, పాన్‌కేక్‌లు మొదలైనవాటిని ఎంచుకుంటారు, మరికొందరు ఇడ్లీలు, చీలాలు, పోహా, మరెన్నో దేశీ పదార్థాలను ఇష్టపడతారు. కానీ నిర్దిష్ట రకాల ఆహారాలకు ముఖ్యంగా ఉదయం పూట దూరంగా ఉండాలి. అయితే వీటికి బదులు ఏం తీసుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి.

1. వైట్ బ్రెడ్‌

వైట్ బ్రెడ్‌లో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇవి ఎక్కువ సేపు ఆకలిని నిలుపుకునేలా ఉంచవు. సాధారణ పిండి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులను కలిగిస్తాయి. అందుకే దీనికి దూరంగా ఉండండి.

1. ఓట్స్: ఓట్స్‌లో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు అధికంగా ఉంటాయి, ఇవి ఉదయం పూట టిఫిన్ గా తీసుకోవడం మంచిది. ఓట్స్ స్థిరమైన శక్తిని అందిస్తాయి. రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణ మొదలైనవాటిని మెరుగుపరిచే విటమిన్లు, ఖనిజాలు కూడా ఓట్స్‌లో పుష్కలంగా ఉన్నాయి. అల్పాహారం కోసం కొన్ని ఓట్స్ తీసుకోండి.

2. Chai-biscuit బిస్కెట్లలో సాధారణంగా శుద్ధి చేసిన చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అవి అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులను కూడా కలిగి ఉంటాయి. ఎటువంటి పోషక విలువలు లేని బిస్కెట్లు మంచి కంటే ఎక్కువ హాని చేస్తాయి. ప్రత్యేకించి ఖాళీ కడుపుతో తింటే. ఉదయాన్నే ముందుగా టీ తీసుకోవడం కూడా మంచిది కాదు. చాయ్ బిస్కెట్‌తో ఉదయాన్ని ప్రారంభించడం ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే ఇది అసిడిటీ సమస్యలకు దారితీస్తుంది.

2. గుడ్లు: క్లాసిక్ అల్పాహారం గుడ్లలో ప్రోటీన్, కాల్షియంతో నిండి ఉంటాయి. అవి పోషకమైనవి మాత్రమే కాకుండా అనేక రకాలుగా ఆరోగ్యాన్ని అందిస్తాయి.

ఇది కూడా చదవండి: 2025 నాటికి 84 కోట్ల మంది ప్రజలు వెన్నునొప్పితో బాధపడే అవకాశం ఉందట..

3. పాన్‌కేక్‌లు ఇందులో రెగ్యులర్ పిండి పాన్‌కేక్‌లలో కొవ్వు, చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ఎక్కువ ఫైబర్ ఉండదు, ఇది అల్పాహారంగా తీసుకున్న తర్వాత వెంటనే ఆకలిగా అనిపిస్తుంది. ఇంకా, చక్కెర కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అసమతుల్యతను కలిగిస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు కూడా అజీర్ణానికి కారణమవుతాయి.

3. పనీర్: కాటేజ్ చీజ్ కూడా ప్రోటీన్, కాల్షియంతో నిండి ఉంటుంది. ఇది దాని రుచితో పాటు పోషకాలతో ఉంటుంది, ఆరోగ్యకరమైన పద్ధతిలో ఆకలిని అరికడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది తోడ్పడుతుంది.

4. ప్రాసెస్డ్ మీట్స్ సాసేజ్‌లు, సలామీ, బేకన్ మొదలైన వాటితో సహా ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ఉప్పు , కొవ్వు అధికంగా ఉంటాయి. అవి ప్రోటీన్ తో ఉన్నప్పటికీ ఆరోగ్యానికి చేటు చేస్తాయి.

4. అరటిపండ్లు: అరటిపండులో కాల్షియం, పొటాషియం మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు మంచిది.

5. ప్యాక్ చేసిన తృణధాన్యాలు మ్యూస్లీ, కార్న్‌ఫ్లేక్స్ మొదలైనవి ఆరోగ్యకరమైనవని మనలో చాలా మంది నమ్ముతున్నారు. ఈ ప్యాక్ చేసిన అల్పాహారం ఎంపికలు పోషకమైనవి కావు.

5. నట్స్: ఉదయం బాదం తింటున్నారా? ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లను కలిగి ఉంటాయి, అల్పాహారానికి సపోర్ట్ గా ఉంటాయి. చక్కెర, పిండి పదార్ధాల ప్రమాదం లేకుండా ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఉదయం పూట తీసుకునే అల్పాహారం వల్ల మన ఆరోగ్యానికి సపోర్ట్ ఉండాలి తప్పితే అధనంగా భారం పడకూడదు. కనుక ఎంచుకునే విధానంలో సరైన చాయిస్ ఉండాలి.

Updated Date - 2023-05-24T13:26:49+05:30 IST