Toothbrush: రోజూ పొద్దున్నే అందరూ కామన్‌గా చేసే బిగ్ మిస్టేక్ ఇదే.. టూత్‌పేస్ట్‌ను వేసే ముందే బ్రష్‌ను కడిగే అలవాటుందా..?

ABN , First Publish Date - 2023-06-02T11:15:12+05:30 IST

రోజుకు రెండు సార్లు బ్రష్ కాకుండా ఒకసారి బ్రష్ చేసినా సరిగా ఒత్తిడి లేకుండా చేయాలి..

Toothbrush: రోజూ పొద్దున్నే అందరూ కామన్‌గా చేసే బిగ్ మిస్టేక్ ఇదే.. టూత్‌పేస్ట్‌ను వేసే ముందే బ్రష్‌ను కడిగే అలవాటుందా..?
brushing

బ్రష్ చేయడం అనేది రోజూ చేసే పనుల్లో ఓ పనిలా మాత్రమే చూస్తాం కానీ దానికి మన ఆరోగ్యానికి, దంత శుభ్రతకు సంబంధం ఉన్నదని ఏమాత్రం ఆలోచన ఉండదు. శరీరంలో అన్ని అవయవాల మీదా చూపించే శ్రద్ధలో నిజానికి దంతాల మీద చూపించే శ్రద్ధ కాస్త తక్కువే. సరిగ్గా చెప్పాలంటే నోటి శుభ్రత, ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే మన శరీరం శక్తిని పొందగలదు. ఎందుకంటే ఆహారం నోటి ద్వారానే తీసుకుంటాం.

దంతాలు దృఢంగా ఉన్నప్పుడే ఎంత గట్టి ఆహారాన్నైనా తినే వీలుంటుంది. అది శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే ఈ విషయంలో నిర్లష్యంగా ఉంటే నోటి ద్వారా వెళ్ళే ఆహారం అనారోగ్యాలను తెచ్చే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో తెలిసో తెలియకో చాలా తప్పులు చేస్తూ ఉంటాం. దంతాలు పాడవడం అనేది బ్రష్‌ చేసే విధానంతోనే మొదలవుతాయనేది దంతవైద్యులు చెబుతున్నమాట.. మామూలుగా బ్రష్ చేసే ముందు మనందరం చేస్తున్న తప్పులేంటో చూద్దాం.

టూత్‌పేస్ట్ బ్రష్ మీద వేసే ముందు తడిగా ఉండకూడదు..

టూత్‌పేస్ట్‌ను వేయడానికి ముందు టూత్‌బ్రష్‌ను తడి చేయడం చాలా పెద్ద తప్పు. ఇలా చేస్తే, టూత్‌పేస్ట్‌ను పలుచగా మారుతుంది. బ్రష్ తడిచేయకుండా వేసినట్లయితే పెస్ట్ గట్టిగా ఉంది త్వరగా కరగదు. పళ్ళకు పట్టి తోమిన కాసేపటికి నురుగు వస్తుంది. అదే బ్రష్ తడిపి టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేస్తే, అది వేగంగా నురుగు వచ్చి త్వరగా కరిగిపోతుంది. టూత్‌పేస్ట్ దంతాలపై ఎక్కువసేపు ఉండాలంటే, బ్రష్ తడిగా ఉండకూడదు.

ఇది కూడా చదవండి: మంచి టూత్‌పేస్ట్ వాడుతున్నాంగా.. బ్రష్‌దేముందేలే అనుకోకండి.. ఎలాంటి బ్రష్ వాడాలి, ఎన్ని నెలలకొకసారి మార్చాలంటే..

ఒత్తిడితో బ్రష్ చేయకూడదు.

పళ్లు తోమే విధానంలో కాస్త సున్నితత్వం ఉండాలి. మరీ ఒత్తిడి చేసి దంతాలను శుభ్రం చేయడం వల్ల చిగుళ్లకు హానికలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దంతాలను శుభ్రం చేయడంలో సరైన బ్రష్‌ను ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

రోజులో రెండుసార్లు బ్రష్

రోజుకు రెండు సార్లు బ్రష్ కాకుండా ఒకసారి బ్రష్ చేసినా సరిగా ఒత్తిడి లేకుండా చేయాలి. ఒత్తిడితో ఎక్కువసేపు బ్రష్ చేయడం దంతాలకు మంచిది కాదు. ఇది చిగుళ్ళ సున్నితత్వాన్ని దెబ్బతీస్తుంది.

రాత్రిపూట బ్రష్ చేయడం ఎందుకు ముఖ్యం..

నిద్రపోతున్నప్పుడు నోటిలో లాలాజలం తక్కువగా ఉంటుంది. పగటిపూట తిన్న ఆహారం పళ్ళలో ఉండి రాత్రంతా పాడైపోతుంది. ఇది నోటి దుర్వాసనతో పాటు పెద్ద సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి రాత్రి బ్రష్ తరవాత దంతాలు, నోరు శుభ్రంగా ఉంటాయి.

Updated Date - 2023-06-05T15:12:27+05:30 IST