Tooth Brush: మంచి టూత్‌పేస్ట్ వాడుతున్నాంగా.. బ్రష్‌దేముందేలే అనుకోకండి.. ఎలాంటి బ్రష్ వాడాలి, ఎన్ని నెలలకొకసారి మార్చాలంటే..

ABN , First Publish Date - 2023-06-01T13:02:50+05:30 IST

దంతాలు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఆహారాన్నైనా సులువుగా తీసుకోగలిగే వీలుంటుంది.

Tooth Brush: మంచి టూత్‌పేస్ట్ వాడుతున్నాంగా.. బ్రష్‌దేముందేలే అనుకోకండి.. ఎలాంటి బ్రష్ వాడాలి, ఎన్ని నెలలకొకసారి మార్చాలంటే..
affect cleaning

టూత్ బ్రష్ మామూలుగా రోజూ ఉదయాన్నే ఓ పనైపోయిందని బ్రష్ చేసి పక్కన పెట్టేయడం అయితే ఇంత మాట్లాడుకునేదేముంది. పళ్ళు తోముకోవడం ఒక్క నోటి శుభ్రతకోసమే కాదు.దంతాలకు సౌకర్యవంతంగా ఉండేందుకు, సురక్షితంగా ఉండేందుకు కూడా సరైన టూత్ బ్రష్‌ని ఎంచుకోవడం అవసరం. ఇక్కడ పేస్ట్ కూడా నాణ్యత కలిగినది ఎంచుకోగలిగితే దంతాలు, పదికాలాలు పటుత్వంతో ఉంటాయి. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. నిజానికి మనలో చాలామందికి ఎటువంటి టూత్ బ్రష్ ఎంచుకోవాలనే దానిమీద సరైన అవగాహన లేదనే చెప్పాలి.

మామూలుగా మన మార్కెట్‌లో రకరకాల ఆకారాలు, పరిమాణాలలో స్టైల్స్‌తో టూత్ బ్రష్‌లు వస్తూనే ఉన్నాయి. దీనిలో ఏది ఎంచుకోవాలో మనకి కాస్త గందరగోళమే. ఏదో రేటు తక్కువని, గరుకైన మృదువుగా ఉందని బ్రష్‌ని ఎంపిక చేసుకోవడం సరికాదంటున్నారు దంతవైద్యులు. దీనికి ఓ ప్రక్రియ ఉందని, బ్రష్ ఎంపికపైనే దంతాల క్షేమం ఆధారపడి ఉందనేది వారి మాట. అసలు ఎటువంటి టూత్ బ్రష్‌ని ఎంచుకోవాలో చూద్దాం.

ఏ రకమైన టూత్ బ్రష్ ఉపయోగించాలి?

మార్కెట్‌లో టూత్ బ్రష్‌ల గురించి డాక్టర్స్ చెప్పేదేమంటే మృదువైన ముళ్ళతో ఉన్న బ్రష్ ఉత్తమమని చెబుతున్నారు. చిన్నతల ఉన్న బ్రష్‌లను ఎంచుకోవాలి, ఎందుకంటే అవి నోటిలోని అన్ని ప్రాంతాలను బాగా చేరుకోగలవు. హ్యాండిల్ రకం, నాన్ స్లిప్ గ్రిప్, ఫ్లెక్సిబుల్ మెడ వంటివి, తల ఆకారం టాపర్డ్ ఉన్నవి ఎంచుకోవాలి. వీటిలో ఏది ఎంచుకున్నా కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. సరైన టూత్ బ్రష్ నోటికి సరిపోయేదిగా, అన్ని దంతాలను సులభంగా చేరుకుని శుభ్రపరిచేదిగా ఉండాలి.

ఇది కూడా చదవండి: హార్మోన్ల అసమానతలు తెలుసుకోకపోతే.. పెద్ద చిక్కే.. ఈ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..!

ఎప్పుడు కొత్త బ్రష్ ని మార్చాలి.

ప్రతి మూడు నెలలకు మార్చడం మంచిది, ముఖ్యంగా జలుబు చేసిన తర్వాత టూత్ బ్రష్‌లను మార్చడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఇన్ఫెక్షన్‌కు దారితీసే సూక్ష్మక్రిములను బ్రష్‌కు సోకే అవకాశం ఉంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో దంతాలను పరిరక్షించుకోవడం అవసరం. దంతాలు ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ఆహారాన్నైనా సులువుగా తీసుకోగలిగే వీలుంటుంది.

Updated Date - 2023-06-01T13:02:50+05:30 IST