Joe Biden: భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-08-23T11:11:55+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత్ రానున్న బైడెన్ నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన సాగనుంది.

Joe Biden: భారత్‌లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎప్పుడంటే..?

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌లో భారత్ రానున్న బైడెన్ నాలుగు రోజులపాటు ఇక్కడే ఉండున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 10 మధ్య బైడెన్ పర్యటన సాగనుంది. ఈ 4 రోజుల పర్యటనలో ఢిల్లీ వేదికగా జరిగే జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ అధికారికంగా ప్రకటించారు. వైట్ హౌజ్ ప్రకటనం ప్రకటించిన వివరాల ప్రకారం.. జీ 20 సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కారణంగా ఉక్రెయిన్‌లో తలెత్తిన యుద్ధం, దాని వల్ల సంభవించిన ఆర్థిక, సామాజిక పరిణామాలు, వాతావరణ మార్పులతో పోరాటం, శుధ్ధ ఇంధనానికి మారడం, బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి ప్రంపంచలోని అనేక సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను బైడెన్ చర్చించనున్నారు. ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించడం ద్వారా పేదరికంపై మెరుగ్గా పోరాడేందుకు ఈ సమావేశంలో దేశాధినేతలతో కలిసి బైడెన్ సమాలోచనలు జరపనున్నారు. కూటమికి భారత ప్రధాని నరేంద్ర మోదీ వహిస్తున్న సారథ్యం గురించి ఆయన ప్రస్తావించనున్నారు. కూటమి దేశాలకు అమెరికా ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్న తీరు గురించి కూడా బైడెన్ వివరించనున్నారు. అలాగే 2026లో జరిగే జీ 20 సదస్సుకు అమెరికా అతిథ్యం ఇచ్చే విషయం గురించి కూడా బైడెన్ మాట్లాడనున్నారు.


అంతకుముందే అమెరికా ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ ఇండోనేషియాలోని జకార్తా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ US-ASEAN సమ్మిట్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఆమె ఇండో-పసిఫిక్ నాయకులతో కలిసి పాల్గొననున్నారు. కాగా సెప్టెంబర్ 4 నుంచి 7 మధ్య కమలా హారిస్ పర్యటన సాగనుంది. ఈ సమావేశంలో కమలా హారిస్ US-ASEAN సంబంధాల విస్తరణ గురించి సమీక్షించనున్నారు. ఆగ్నేయాసియా, ASEAN కేంద్రీకరణ పట్ల యునైటెడ్ స్టేట్స్ యొక్క శాశ్వత నిబద్ధతను పునరుద్ఘాటిస్తారు. అలాగే ఈ సమవేశంలో కమలా హారిస్ వాతావరణ సంక్షోభం, సముద్ర భద్రత, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి, అంతర్జాతీయ నియమాలు, నిబంధనలను సమర్థించే, బలోపేతం చేసే ప్రయత్నాలతో సహా, మన భాగస్వామ్య శ్రేయస్సు, భద్రతను ప్రోత్సహించడానికి ఉపాధ్యక్షురాలు చొరవ తీసుకుంటారు.

Updated Date - 2023-08-23T11:12:18+05:30 IST