Kiren Rijiju : మంత్రిత్వ శాఖ మార్పుపై కిరణ్ రిజిజు స్పందన

ABN , First Publish Date - 2023-05-19T14:21:32+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేత‌ృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు

Kiren Rijiju : మంత్రిత్వ శాఖ మార్పుపై కిరణ్ రిజిజు స్పందన
Narendra Modi, Kiren Rijiju

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేత‌ృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందించారు. తనను న్యాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి, ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించడంపట్ల సానుకూలంగా స్పందించారు. మంత్రివర్గంలో మార్పులు సాధారణ విషయమేనని చెప్పారు. తన శాఖను మార్చడంలో మోదీ దార్శనికత కనిపిస్తోందని, ఈ మార్పు ద్వారా తనను శిక్షించినట్లు కాదని చెప్పారు. ఆయన ఎర్త్ సైన్సెస్ మంత్రి బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు.

ఈ మార్పు రొటీన్ ప్రాసెస్ అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికత అని చెప్పారు. ఎవరో ఒకరు బాధ్యతను స్వీకరించాలని చెప్పారు. ఎక్కడా తప్పు జరగకూడదన్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రతిపక్షాల కర్తవ్యమని, వారిని మాట్లాడనివ్వండని అన్నారు. ఇది రాజకీయాలు మాట్లాడవలసిన రోజు కాదని చెప్పారు. కిరణ్ రిజిజు శుక్రవారం ఎర్త్ సైన్సెస్ మంత్రి పదవిని చేపట్టారు. న్యూఢిల్లీలోని లోఢీ రోడ్‌లో పృథ్వీ భవన్‌‌లో ఈ కార్యక్రమం జరిగింది.

ప్రధాని మోదీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మంత్రివర్గంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి కిరణ్ రిజిజును తొలగించి, ఆ పదవిని అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌కు అప్పగించారు. న్యాయ శాఖ మంత్రిగా బీజేపీకి నమ్మకస్థుడిగా మెలగిన రిజిజుకు తక్కువ స్థాయి ప్రొఫైల్ ఉన్న ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించారు. న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను రిజిజు తప్పుబట్టేవారు. దీంతో కేంద్రానికి, న్యాయ వ్యవస్థకు మధ్య జగడం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి :

UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?

Kozhikode train arson case: నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని లీక్ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్

Updated Date - 2023-05-19T14:21:32+05:30 IST