Share News

Mohan Yadav: ప్రపంచ కాలాన్ని మారుస్తాం.. మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 24 , 2023 | 08:43 PM

రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.

Mohan Yadav: ప్రపంచ కాలాన్ని మారుస్తాం.. మధ్యప్రదేశ్ సీఎం సంచలన వ్యాఖ్యలు

భోపాల్: రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ మెరిడియన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ గుండా వెళ్తుందని, కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రపంచ కాలాన్ని మార్చడానికి తాను కృషి చేస్తానని తెలిపారు. ప్రైమ్ మెరిడియన్ గ్రీన్‌విచ్ గుండా వెళ్తుందని 1884లో ప్రతిపాదించారు. దీంతో ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ విధానాన్నే అనుసరిస్తుంది. కానీ నిజానికి ప్రైమ్ మెరిడియన్ ఉజ్జయిని నుంచి వెళ్తోంది. కాబట్టి ఉజ్జయిని ప్రపంచ ప్రైమ్ మెడియన్‌.. కాబట్టి తాను ప్రపంచ కాలాన్ని సరిదిద్దడానికి ప్రయత్నిస్తానని మోహన్ యాదవ్ తెలిపారు. కాగా ప్రపంచ కాలానికి ‘0’ డిగ్రీల రేఖాంశం అత్యంత ముఖ్యమైనది. దీనినే ‘ప్రైమ్ మెరిడియన్’ అని పిలుస్తుంటారు. ఈ రేఖాంశం నుంచి భూమిని నిలువుగా రెండు వైపుల సమానంగా విభజిస్తున్నారు. ఈ రేఖాంశం ఇంగ్లాండ్‌లోని గ్రీన్‌విచ్ అనే ప్రాంతం గుండా వెళ్తుంది. దీంతో ప్రస్తుతం ఈ విధానాన్నే కాలానికి ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దీనినే మోహన్ యాదవ్ మారుస్తానంటున్నారు.


‘‘ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మన ఉజ్జయిని సమయం. కానీ పారిస్ సమయాన్ని నిర్ణయిండం ద్వారా ప్రపంచం మొత్తం దానినే అనుసరిస్తున్నారు. గ్రీన్‌విచ్‌ని ప్రైమ్ మెరిడియన్‌గా భావించి బ్రిటిషర్లు దీనిని స్వీకరించారు. దానినే ప్రధాన ప్రైమ్ మెరిడియన్‌గా పేర్కొన్నారు ’’ అని మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో పేర్కొన్నారు. అలాగే 300 ఏళ్ల క్రితమే ప్రపంచ ప్రామాణిక సమయాన్ని భారతదేశం నిర్ణయించిందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో సమయాన్ని నిర్ధారించే పరికరం ఇప్పటికీ ఉందని చెప్పారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత రోజు ప్రారంభం కావడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. సూర్యోదయం లేదా కొంత సమయం తర్వాతే ప్రజలు మేల్కొంటారని చెప్పుకొచ్చారు. కాగా కొన్ని హిందూ పురాణాల ప్రకారం.. సున్నా డిగ్రీల రేఖాంశం, కర్కాటక రేఖ పరస్పరం ఉజ్జయిని వద్ద ఖండించుకుంటాయి. జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి అధిక ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. వరాహమిహిర, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్య వంటి ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఉజ్జయినిలో నివసించారని చెబుతున్నారు. భారత్‌లో గల పురాతన నగరాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉజ్జియిని ఒకటి. 1720లో జైపూర్ మహారాజా సవాయ్ జై సింగ్ 2 ఉజ్జయినిలో అబ్జర్వేటరీని నిర్మించారు. వీటి ప్రకారమే ప్రపంచ కాలాన్ని మార్చేందుకు కృషి చేస్తానని మోహన్ యాదవ్ చెబుతున్నారు.

Updated Date - Dec 24 , 2023 | 08:43 PM