Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయం యావత్తు మానవాళి గెలుపు.. గ్రీస్ అధ్యక్షురాలితో మోదీ..

ABN , First Publish Date - 2023-08-25T15:33:51+05:30 IST

చంద్రయాన్-3 (Chandrayaan-3) సాధించిన విజయం కేవలం భారత దేశానికి మాత్రమే సొంతం కాదని, అది యావత్తు మానవాళి సాధించిన విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు.

Chandrayaan-3 : చంద్రయాన్-3 విజయం యావత్తు మానవాళి గెలుపు.. గ్రీస్ అధ్యక్షురాలితో మోదీ..
Narendra Modi, Katerina Sakellaropoulou

ఏథెన్స్ (గ్రీస్) : చంద్రయాన్-3 (Chandrayaan-3) సాధించిన విజయం కేవలం భారత దేశానికి మాత్రమే సొంతం కాదని, అది యావత్తు మానవాళి సాధించిన విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించే సమాచారం శాస్త్రవేత్తలకు, మానవాళికి ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రీస్ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలోవుతో చర్చల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రయాన్-3 విజయవంతమైనందుకు మోదీకి కాటెరినా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మోదీ స్పందిస్తూ, చంద్రయాన్-3 విజయం కేవలం భారత దేశానిది మాత్రమే కాదని, అది యావత్తు మానవాళి సాధించిన ఘనత అని చెప్పారు. చంద్రయాన్-3 చంద్రునిపై సేకరించే సమాచారం అందరు శాస్త్రవేత్తలకు, యావత్తు మానవాళికి ఉపయోగపడుతుందని తెలిపారు.

గ్రీస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్‌ను మోదీకి కాటెరినా ప్రదానం చేశారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై భారత దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టిన మొదటి దేశంగా మన దేశం రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ మన దేశాన్ని ప్రశంసిస్తున్నారు.

మోదీ శుక్రవారం గ్రీస్‌ పర్యటన ఏథెన్స్‌లోని గుర్తు తెలియని సైనికుని స్థూపం వద్ద నివాళులర్పించడంతో ప్రారంభమైంది. అనంతరం గ్రీస్ సైనికులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటకిస్ ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జి గెరపెట్రిటిస్ స్వాగతం పలికారు.

భారతీయ మూలాలుగల ప్రజలు, బాలబాలికలు, పెద్దలు సహా పెద్ద ఎత్తున ఏథెన్స్‌లోని హోటల్‌ వద్ద మోదీకి స్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’, ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. జాతీయ జెండాలను ఊపుతూ, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడారు.

మోదీ ఈ నెల 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న అనంతరం గ్రీస్ వెళ్లారు. భారత దేశ ప్రధాన మంత్రి గ్రీస్‌లో పర్యటించడం సుమారు 40 ఏళ్లలో ఇదే మొదటిసారి. గ్రీస్ ప్రధాని కిరియకోస్ మిట్సోటకిస్ 2019లో న్యూఢిల్లీ వచ్చారు.


ఇవి కూడా చదవండి :

Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

Updated Date - 2023-08-25T15:33:51+05:30 IST