PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

ABN , First Publish Date - 2023-08-25T10:30:40+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వారసునిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. మోదీ తర్వాత ఎవరిని ప్రధాన మంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 29 శాతం మంది అమిత్ షాకు ఓటు వేశారు.

PM Post : తదుపరి ప్రధాన మంత్రి అమిత్ షా!.. యోగికి నో ఛాన్స్!..

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వారసునిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. మోదీ తర్వాత ఎవరిని ప్రధాన మంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 29 శాతం మంది అమిత్ షాకు ఓటు వేశారు. ఆయన తర్వాతి స్థానంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు. ఇండియా టుడే-సీ ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మోదీ తర్వాత ప్రధాన మంత్రి పదవిని అమిత్ షా చేపడితే బాగుంటుందని ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 29 శాతం మంది చెప్పారు. యోగి ఆదిత్యనాథ్‌ను 26 శాతం మంది సమర్థించగా, నితిన్ గడ్కరీకి 15 శాతం మంది మద్దతు లభించింది.


ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 306 స్థానాలు లభిస్తాయని ఈ సర్వే ఫలితాలు అంచనా వేశాయి. ప్రతిపక్ష ఇండియా (I.N.D.I.A) కూటమికి 193 స్థానాలు లభించే అవకాశం ఉందని, 44 స్థానాలను ఇతరులు దక్కించుకుంటారని అంచనా వేశాయి.

ఈ సంస్థలు జనవరిలో నిర్వహించిన సర్వేతో పోల్చుకుంటే తాజా సర్వేలో ఎన్డీయే మెరుగుపడింది. ఎన్డీయేకు 298 స్థానాలు లభించే అవకాశం ఉందని జనవరి సర్వే ఫలితాలు అంచనా వేయగా, తాజా సర్వే ప్రకారం 306 స్థానాలు లభించవచ్చునని వెల్లడైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 357 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.

ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా తాజా సర్వేలో గతం కన్నా మెరుగుపడింది. జనవరి సర్వేలో 153 స్థానాలు వస్తాయని అంచనా వేయగా, తాజా సర్వేలో ఈ కూటమికి 193 స్థానాలు లభించే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

షెడ్యూలు ప్రకారం లోక్ సభ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో జరగవలసి ఉంది.


ఇవి కూడా చదవండి :

Chandrayaan-3: ల్యాండర్, రోవర్‌ల 14 రోజుల కథ.. ఆ కాలపరిమితి వెనుక స్టోరీ ఏంటి? ఆ తర్వాత ఏమవుతుంది?

Xi Jinping Vs Modi : భారత్-చైనా సంబంధాలు.. మోదీకి సుద్దులు చెప్పిన జిన్‌పింగ్..

Updated Date - 2023-08-25T10:46:28+05:30 IST