Nitin Gadkari : రాజకీయాల నుంచి తప్పుకోవడంపై గడ్కరీ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-03-31T11:08:46+05:30 IST

మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.

Nitin Gadkari : రాజకీయాల నుంచి తప్పుకోవడంపై గడ్కరీ వ్యాఖ్యలు
Nitin Gadkari

ముంబై : మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) చెప్పారు. తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు వచ్చిన కథనాలను తోసిపుచ్చారు. ‘‘రాజకీయాల నుంచి వైదొలగాలనే ఉద్దేశం నాకు లేదు’’ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్పష్టత ఇచ్చారు.

‘‘ఈ విషయంలో వార్తలను ప్రజలకు తెలియజేసేటపుడు బాధ్యతాయుతమైన పాత్రికేయాన్ని మీడియా తప్పకుండా నిలబెట్టాలి’’ అని కోరారు. ఆయన గురువారం ముంబై-గోవా హైవే నిర్మాణ పనులను ఏరియల్ సర్వే చేశారు. ఈ ఏడాది డిసెంబరునాటికి ఈ హైవే నిర్మాణం పూర్తవుతుందని, 2024 జనవరిలో ట్రాఫిక్‌ను అనుమతిస్తామని చెప్పారు. ఈ హైవే నిర్మాణాన్ని 10 ప్యాకేజీలుగా విభజించినట్లు తెలిపారు. వీటిలో సింధుదుర్గ్ జిల్లాలోని రెండు ప్యాకేజీలు 99 శాతం మేరకు పూర్తయ్యాయన్నారు. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హుష్ మనీ కేసు

Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం

Updated Date - 2023-03-31T11:08:46+05:30 IST