Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హుష్ మనీ కేసు

ABN , First Publish Date - 2023-03-31T07:38:30+05:30 IST

డోనాల్డ్ ట్రంప్ హుష్ మనీ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచారు....

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హుష్ మనీ కేసు
Donald Trump,porn star Stormy Daniels

వాషింగ్టన్ : డోనాల్డ్ ట్రంప్ హుష్ మనీ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచారు.(Donald Trump) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2016 ఎన్నికల ప్రచార సమయంలో పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించడంపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ(New York grand jury) గురువారం అభియోగాలు మోపింది.2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది డబ్బు చెల్లించడంపై సంవత్సరాల తరబడి దర్యాప్తు తర్వాత న్యూయార్క్‌లో ఆరోపణలు వెలుగుచూశాయి.స్టార్మీ డేనియల్స్‌కు(porn star Stormy Daniels) $130,000 డాలర్ల చెల్లింపులపై విచారించిన తర్వాత ట్రంప్ పై గ్రాండ్ జ్యూరీ నేరారోపణ చేసింది.

ఇది కూడా చదవండి : Pakistan:పాక్‌లో దారుణం... గోథుమపిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట...ఐదుగురి మృతి

2024లో మళ్లీ పోటీ చేసేందుకు రిపబ్లికన్‌ అభ్యర్థిత్వాన్ని కోరుతున్న ట్రంప్‌ తనపై చేస్తున్న విచారణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. తాను అమాయకుడినని ఆ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు.2006వ సంవత్సరంలో ట్రంప్‌ సాగించిన లైంగిక వేధింపుల గురించి మౌనంగా ఉన్నందుకు బదులుగా తనకు డబ్బు అందిందని స్టార్మీ డేనియల్స్ చెప్పారు. 2018వ సంవత్సరంలో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి డేనియల్స్‌తో తనకు ఎలాంటి లైంగిక సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.

ఇది కూడా చదవండి : Delhi: ఢిల్లీలో భారీగాలులతో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

2006 వసంవత్సరం జులైలో జరిగిన చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్‌లో తాను ట్రంప్‌ను కలిశానని మీడియా ఇంటర్వ్యూలో డానియల్స్ చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ట్రంప్ తరపు న్యాయవాది మైఖేల్ కోహెన్ ఈ వ్యవహారంలో మౌనంగా ఉండేందుకుగాను తనకు $130,000 డాలర్లను ‘‘హష్ మనీ’’గా(hush money) చెల్లించారని పోర్న్ స్టార్ స్టార్మీ చెప్పారు.

Updated Date - 2023-03-31T07:49:33+05:30 IST