Pakistan:పాక్‌లో దారుణం... గోథుమపిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట...ఐదుగురి మృతి

ABN , First Publish Date - 2023-03-31T06:56:14+05:30 IST

పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశంలో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల ఉచిత పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట జరిగింది....

Pakistan:పాక్‌లో దారుణం... గోథుమపిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట...ఐదుగురి మృతి
stampedes at flour distribution site

పెషావర్ (పాకిస్థాన్): పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశంలో ద్రవ్యోల్బణం ప్రభావం వల్ల ఉచిత పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట జరిగింది.(stampedes) పాక్ దేశంలోని (Pakistan) పెషావర్‌లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉచితంగా గోథుమ పిండి బస్తాల పంపిణీ కేంద్రాలకు (flour distribution sites) ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పాకిస్థాన్ దేశంలో గోథుమ పిండి ధరలు 45 శాతం పెరిగిన నేపథ్యంలో రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం పేదలకు ఉచితంగా గోథుమపిండి కేంద్రాలను ఏర్పాటు చేసింది. గోథుమపిండి పంపిణీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మరణించారు.

తూర్పు పంజాబ్‌లోని పంపిణీ కేంద్రాల్లో ఇద్దరు మహిళలతో సహా నలుగురు వ్యక్తులు మరణించారని ప్రావిన్షియల్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అమీర్ మీర్ చెప్పారు. గోథుమపిండి పంపిణీ కేంద్రాల్లో జనం రద్దీ కారణంగా పలువురు గాయపడ్డారని, ఈ ఘటనలపై విచారణకు ఆదేశించామని సీఎం మొహ్సిన్ నఖ్వీ చెప్పారు. ఉత్తర ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో పిండి పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో మరో వ్యక్తి మరణించాడు.గోథుమపిండి ట్రక్కులు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో జనం ఎగబడి పిండి బస్తాలను ఎత్తుకెళ్లారు.

Updated Date - 2023-03-31T06:56:14+05:30 IST