Delhi: ఢిల్లీలో భారీగాలులతో వర్షం...22 విమానాల దారి మళ్లింపు

ABN , First Publish Date - 2023-03-31T07:13:35+05:30 IST

ఢిల్లీలో ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయం నుంచి 22 విమానాలను...

Delhi: ఢిల్లీలో భారీగాలులతో వర్షం...22 విమానాల దారి మళ్లింపు
Flights diverted

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం రాత్రి ఉరుములు,మెరుపులు, భారీ గాలులతో కురిసిన భారీవర్షం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.(Flights diverted)దేశ రాజధానిలో(Delhi) ప్రతికూల వాతావరణం కారణంగా గురువారం రాత్రి ఢిల్లీ విమానాశ్రయం నుంచి 22 విమానాలను దారి మళ్లించారు. పిడుగులు పడటంతో పాటు భారీ గాలులు వీచడంతో(strong winds) 22 విమానాలను దారి మళ్లించినట్లు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు చెప్పారు.

ఈ విమానాలను లక్నో, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్‌ విమానాశ్రయాలకు మళ్లించినట్లు ఢిల్లీ విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. దేశ రాజధానిలో గురువారం రాత్రి పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.లక్నోకు 11విమానాలు, జైపూర్‌కు 8, అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్‌లకు ఒక్కొక్కటి చొప్పున విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారి వివరించారు.విమానాల దారి మళ్లింపు వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Updated Date - 2023-03-31T07:14:15+05:30 IST