gold and silver rate today: వామ్మో 56వేలు దాటిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్..

ABN , First Publish Date - 2023-01-10T11:37:05+05:30 IST

బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. వెండి కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. దేశంలో ఒక్కసారిగా

gold and silver rate today: వామ్మో 56వేలు దాటిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్..

బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. వెండి కూడా అదేస్థాయిలో పెరుగుతోంది. దేశంలో ఒక్కసారిగా బంగారానికి రెక్కలు వచ్చినట్లు ధరలు దూసుకుపోతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 56 వేలు దాటేసింది. సోమవారం రూ.330 పెరిగిన బంగారం ధర.. నేడు కూడా అదే తరహాలో రూ. 330 పెరిగింది. ఇక హైదరాబాద్‎లోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. ఇక వెండి విషయానికి వస్తే..బంగారం దారిలోనే వెండి ధరలు కూడా చుక్కలు చూపుతున్నాయి. కిలో వెండిపై ఏకంగా రూ.500 పెరిగి ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక దేశంలోని ప్రధానమైన నగరాల్లో బంగారం ధరలపై ఓ లుక్కేద్దామ్...

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.51,600 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.52,370 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,130 ఉంది.

బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.51,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,180 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.51,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్స్

హైదరాబాద్‎లో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.51,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్టణం‎లో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.51,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,130 వద్ద ఉంది

విజయవాడ‎లో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.51,450 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.56,130గా కొనసాగుతోంది.

సిల్వర్ రేట్స్..

హైదరాబాద్‎లో కిలో వెండి ధర రూ.74,900

విజయవాడలో కిలో వెండి ధర రూ.74,900

విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.74,900

బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,800

చెన్నైలో కిలో వెండి ధర రూ. 74,900

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,800గా కొనసాగుతోంది.

Updated Date - 2023-01-10T11:42:48+05:30 IST