JDS Nikhil Gowda: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

ABN , First Publish Date - 2023-05-13T14:40:52+05:30 IST

కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ‘

JDS Nikhil Gowda: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!
Nikhil Kumara Swamy

బెంగళూరు : కర్ణాటక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా ఉంది. శాసన సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి, కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ‘కింగ్‌మేకర్’గా ప్రసిద్ధి పొందిన జేడీఎస్‌కు చుక్కలు చూపించారు. అది ఎంత తీవ్రంగా ఉందంటే జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి గెలిచినప్పటికీ, ఆయన కుమారుడు నిఖిల్ కుమార స్వామి పరాజయంపాలయ్యారు. నిఖిల్ తల్లి అనిత కుమార స్వామి చేసిన త్యాగం వృథా అయింది.

నిఖిల్ కుమార స్వామి ఈ ఎన్నికల్లో రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ నియోజకవర్గానికి ఆయన తల్లి అనిత కుమార స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆమె త్యాగం చేసి, ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఇక్కడి నుంచి తన కుమారుడు నిఖిల్‌ను నిలిపారు. నిఖిల్‌పై కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ విజయం సాధించారు. ఇక్కడి నుంచి బీజేపీ తరపున గౌతమ్ గౌడ పోటీ చేశారు.

అయితే నిఖిల్ కుమార స్వామికి ఓటమి కొత్త కాదు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆయనపై సుమలత గెలిచారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం దక్కించుకున్నారు.

2018 శాసన సభ ఎన్నికల్లో చన్నపట్న, రామనగర నియోజకవర్గాల్లో గెలిచారు. రామనగరకు రాజీనామా చేసి, అనిత చేత పోటీ చేయించారు. ఆమె గెలిచారు. ఇప్పుడు ఈ స్థానం నుంచి నిఖిల్ పోటీ చేసి, ఓడిపోయారు.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy: ఆ విషయం కర్ణాటక ప్రజలకు నచ్చలేదు.. అందుకే..

DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే

Updated Date - 2023-05-13T15:01:22+05:30 IST