Congress : రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు... కాంగ్రెస్ మండిపాటు...

ABN , First Publish Date - 2023-03-19T13:06:10+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని 12, తుగ్లక్ వీథిలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్ళడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

Congress : రాహుల్ గాంధీ నివాసానికి పోలీసులు... కాంగ్రెస్ మండిపాటు...
Rahul Gandhi Residence in Delhi

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని 12, తుగ్లక్ వీథిలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెళ్ళడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో ప్రస్తావించిన లైంగిక వేధింపుల బాధితుల వివరాలు ఇవ్వాలని కోరడంపై మండిపడింది. అదానీ గ్రూప్ అవకతవకలపై తమ ప్రశ్నలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, అందుకే ఢిల్లీ పోలీసుల ద్వారా ఈ నాటకానికి తెర తీశారని ఆరోపించింది.

దేశంలో లక్షలాది మంది మహిళలు స్వేచ్ఛగా సంచరించేందుకు, తమ ఆవేదనను వినిపించడానకి, తమ బాధలను పంచుకోవడానికి భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ అవకాశం కల్పించినట్లు తెలిపింది. అదానీపై తాము సంధిస్తున్న ప్రశ్నలతో మోదీ ఎంతగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారో ఢిల్లీ పోలీసుల చౌకబారు నాటకాలే రుజువు చేస్తున్నాయని తెలిపింది. సమాధానాలను కోరే తమ దృఢ సంకల్పాన్ని ఈ వేధింపులు మరింత బలోపేతం చేస్తాయని తెలిపింది.

రాహుల్ గాంధీ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ, మన దేశంలో మహిళలపై దాడులు ఇప్పటికీ జరుగుతున్నాయన్నారు. దీని గురించి మీడియా మాట్లాడటం లేదన్నారు. తన పాదయాత్రలో తనను ఇద్దరు మహిళలు కలిశారని చెప్పారు. తమపై సామూహిక అత్యాచారం జరిగిందని వారు తనకు చెప్పారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని తాను వారికి చెప్పానని, ఫిర్యాదు చేస్తే తమకు పెళ్లిళ్లు కావనే ఉద్దేశంతో, ఫిర్యాదు చేసేందుకు వారు తిరస్కరించారని తెలిపారు. ఈ మాటలను ఢిల్లీ పోలీసులు విచారణకు చేపట్టారు. బాధితుల వివరాలను తమకు తెలియజేయాలని రాహుల్ గాంధీని కోరారు. ఓ ప్రశ్నావళిని కూడా ఆయనకు పంపించారు.

ఇదిలావుండగా, రాహుల్ నివాసానికి కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి :

Punjab : అమృత్‌పాల్ సింగ్ పాకిస్థానీ ఐఎస్ఐ ఏజెంట్ : నిఘా వర్గాలు

Rahul Gandhi : రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు దళాలు... ‘భారత్ జోడో యాత్ర’లో ప్రసంగం చిచ్చు...

Updated Date - 2023-03-19T13:06:10+05:30 IST