G20 summit : రుషి సునాక్ వ్యాఖ్యలపై చైనా ఘాటు స్పందన

ABN , First Publish Date - 2023-09-08T14:30:26+05:30 IST

జీ20 సమావేశాల్లో అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో సానుకూల ఫలితాలు రావడం కోసం అందరితో పాటు పని చేస్తామని తెలిపింది.

G20 summit : రుషి సునాక్ వ్యాఖ్యలపై చైనా ఘాటు స్పందన

న్యూఢిల్లీ : జీ20 సమావేశాల్లో అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో సానుకూల ఫలితాలు రావడం కోసం అందరితో పాటు పని చేస్తామని తెలిపింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ చైనాపై విమర్శలు చేసిన నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ఈ వివరణ ఇచ్చారు.

ఉక్రెయిన్ సహా అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరడంలో జాప్యం జరిగేలా చైనా పని చేస్తోందని రుషి సునాక్ చెప్పినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. దీనిపై మావో నింగ్ స్పందిస్తూ, న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాల్లో సానుకూల ఫలితాలు రావడం కోసం అందరితో పాటు పని చేస్తామని తెలిపారు. అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

శని, ఆదివారాల్లో జరిగే జీ20 సదస్సులో సభ్య దేశాల అగ్ర నేతలు అనేక అంతర్జాతీయ సమస్యలపై చర్చిస్తారు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ20 సభ్య దేశాలదే. ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల జనాభా ఈ దేశాల్లో ఉంది.

అర్జంటైనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ జీ20 దేశాలు. ఈ ఏడాది బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను ప్రత్యేక అతిథులుగా ఈ సదస్సుకు ఆహ్వానించారు.


ఇవి కూడా చదవండి :

నగరంలో.. నాలుగు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం

Sanatana Dharmam : సనాతన ధర్మంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - 2023-09-08T14:30:26+05:30 IST