Share News

Ayodhya: నెక్లెస్‌పై 5 వేల వజ్రాలతో అయోధ్య రామ మందిరం తయారు

ABN , Publish Date - Dec 19 , 2023 | 08:42 AM

అయోధ్య శ్రీరామునిపై ఉన్న తన భక్తిని ఓ వజ్రాల వ్యాపారి నెక్లెస్ రూపంలో చాటుకున్నాడు. రసేష్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా అనే వజ్రాల వ్యాపారి అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 5000 అమెరికన్ వజ్రాలను ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ను తయారు చేశారు.

Ayodhya: నెక్లెస్‌పై 5 వేల వజ్రాలతో అయోధ్య రామ మందిరం తయారు

సూరత్: అయోధ్య శ్రీరామునిపై ఉన్న తన భక్తిని ఓ వజ్రాల వ్యాపారి నెక్లెస్ రూపంలో చాటుకున్నాడు. సూరత్‌కు చెందిన రసేష్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా అనే వజ్రాల వ్యాపారి అద్భుతమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ 5000 అమెరికన్ వజ్రాలను ఉపయోగించి రామాలయం థీమ్‌పై నెక్లెస్‌ను తయారు చేశారు. దానిని అయోధ్యలోని రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మొత్తం 40 మంది కళాకారులు కలిసి 35 రోజుల్లో ఈ నెక్లెస్‌ను పూర్తి చేశారు. ఈ నెక్లెస్ తయారీలో 5000 అమెరికన్ వజ్రాలతోపాటు 2 కిలోల వెండిని ఉపయోగించారు. అయోధ్య రామ మందిరం, సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామిని ఈ నెక్లెస్‌లో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రసేష్ జ్యువెల్స్ డైరెక్టర్ కౌశిక్ కాకడియా మాట్లాడుతూ "5000 కంటే ఎక్కువ అమెరికన్ వజ్రాలు ఉపయోగించాం. 2 కిలోల వెండితో తయారు చేశాం. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయం ద్వారా మేము స్ఫూర్తి పొందాము. ఇది ఏ వాణిజ్య ప్రయోజనం కోసం కాదు. మేము ఈ నెక్లెస్‌ను రామ మందిరానికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాము. అయోధ్య రామ మందిరానికి ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నెక్లెస్‌ను తయారు చేశాం. రామాయణంలోని ప్రధాన పాత్రలను నెక్లెస్‌లో చెక్కాం.’’ అని తెలిపారు.


కాగా వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన మధ్యాహ్న సమయంలో రామాలయం గర్భగుడి వద్ద శ్రీరాముడి పట్టాభిషేకం చేయాలని శ్రీరామ జన్మభూమి తీరథ్ క్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్య, శ్రీరాముని జన్మస్థలం.. భారతదేశ ప్రజలతో గొప్ప ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు సంబంధించి ప్రధాన వేడుకకు ఒక వారం రోజుల మందు జనవరి 16 నుంచి వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. వారణాసికి చెందిన వేద పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ జనవరి 22న శ్రీరాముని పవిత్రోత్సవం ప్రధాన ఆచారాలను నిర్వహిస్తారు. జనవరి 14 నుంచి 22 వరకు అయోధ్య రామాలయం ప్రారంభానికి సంబంధించిన వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో హుండీ మహాయజ్ఞం కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వేలాది మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. అయోధ్యలో అనేక డేరా నగరాలను నిర్మిస్తున్నారు. అందులో వేలాది మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 10,000-15,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక అధికారులు 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సాఫీగా జరిగేందుకు, భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మెరుగైన భద్రతా చర్యలను అమలు చేసేందుకు స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలాంటి మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 19 , 2023 | 08:42 AM