karnataka election results live updates: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

ABN , First Publish Date - 2023-05-13T08:02:35+05:30 IST

దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది...

karnataka election results live updates: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

04:32 PM: కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే...

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ (Karnataka poll result) ముగిసింది. కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీ సాధించింది. ఏకంగా 136 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. బీజేపీ 64 స్థానాల్లో గెలుపొందింది. ఇక కింగ్ మేకర్‌గా మారుతుందని అంచనా వేసిన జేడీఎస్ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది.

Untitled-8.jpg

04:02 PM: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఎన్నికల అధికారి నుంచి గెలుపు ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి ఆర్.అశోకపై ఏకంగా 1 లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

Untitled-6.jpg

03:32 PM: కర్ణాటక ఫలితాలపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే...

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై (Karnataka election results) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ (KTR) స్పందించారు. ‘‘కర్ణాటక ప్రజలను వినోదపరచడంలో ‘ది కేరళ స్టోరీ’ ఏవిధంగా విఫలమైందో.. అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. వెగటు పుట్టించే, విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు. మరింత గొప్ప భారత్ కోసం పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన విషయంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఆరోగ్యకరంగా పోటీపడనిద్దాం. కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వనికి నా శుభాకాంక్షలు ’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

03:02 PM: ఇప్పుడు దక్షిణభారతం ‘బీజేపీ ముక్త్’ అని చత్తీష్‌గడ్ సీఎం భూపేష్ భాఘెల్ వ్యాఖ్యానించారు.

2.45 PM: కర్ణాటక ఫలితాలపై రాహుల్ స్పందన

  • రాబోయే రోజుల్లో కేంద్రం, రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు

  • శత్రుత్వ బజార్ మూతపడింది, ప్రేమించే దుకాణం తెరుచుకుంది

  • పేదల తరపున కాంగ్రెస్ పోరాడింది... ఇది బలవంతులపై బలహీనుల విజయం

  • ప్రతి కార్యకర్త శ్రమించి పనిచేశారు

2.15 PM: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్....

కర్నాటక ఫలితాలు నేను చెప్పినట్లే వచ్చాయి

తెలంగాణలో BRSకి 25 సీట్లకు మించిరావు

బీజేపీ 9, ఎంఐఎం 7 సీట్లకే పరిమితం

మిగిలిన సీట్లన్నీ కాంగ్రెస్‌కే...

01:54 PM: ఒకే ఒక్కరోజు ప్రచారంతో డీకే శివకుమార్ రికార్డ్ విజయం..

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంచలన విజయం సాధించారు. కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన రికార్డ్ స్థాయి విజయాన్ని దక్కించుకున్నారు. ఏకంగా 1 లక్ష పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. కాగా పార్టీని ముందుండి నడిపించిన డీకే శివకుమార్ తాను పోటీ చేసిన నియోజకవర్గంలో కేవలం ఒక్క రోజు మాత్రమే ప్రచారం చేయడం గమనార్హం.

Untitled-33.jpg

01:31 PM: జేడీఎస్ అధినేత కుమారస్వామి గెలుపు

Untitled-22.jpg

01:25 PM: ప్రస్తుతానికి లెక్కలు ఇవే...

కర్ణాటకలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 28 నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. మరో 105 చోట్ల ఆధిక్యంలో (మొత్తం 133) కొనసాగుతోంది. ఇక ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ 7 చోట్ల విజయం సాధించగా.. మరో 58 చోట్ల లీడ్‌లో (మొత్తం 65) ఉంది. మరోవైపు కింగ్ మేకర్‌గా విశ్లేషించిన చతికిలపడింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు గెలుపొందగా మరో 20 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. మరో నాలుగు చోట్ల ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.

Untitled-20.jpg

Untitled-21.jpg

01:10 PM: మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించారు. అయితే బళ్లారి సిటీ నుంచి పోటీ చేసిన ఆయన సతీమణి లక్ష్మీ అరుణ ఎదురుగాలి వీస్తోంది. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి చెప్పుకోదగ్గ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Untitled-19.jpg

01:03 PM: పలు నియోజకవర్గాల్లో గెలుపోటములు ఇవే...

  • రాజాజినగర్‌లో బీజేపీ అభ్యర్థి ఎస్ సురేష్ కుమార్ విజయం.

  • ఆర్ఆర్ నగర్‌లో మంత్రి మునిరత్న ఓటమి

  • చంద్రగిరిలో మడల్ మల్లికార్జున్ ఓటమి

  • మయకొండ, చెన్నగిరిలో కాంగ్రెస్ గెలుపు

  • కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే గెలుపు. భల్కీ నియోజకవర్గంలో 22,000 మెజారిటీతో గెలుపు.

  • కర్ణాటక వైద్యశాఖ మంత్రి సుధాకర్ ఓటమిపాలయ్యారు. చిక్కబళ్లాపుర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ గెలుపొందారు.

  • లింగాయత్ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో అత్యధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి లింగాయత్ వర్గం బీజేపీకి దూరమైనట్టు స్పష్టమవుతోంది.

Untitled-18.jpg

12:49 PM: సీఎం ఎవరనే చర్చపై నోరు విప్పిన కాంగ్రెస్...

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైన నేపథ్యంలో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే ఆసక్తికర చర్చపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సీఎంగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Untitled-17.jpg

12:23 PM: కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని తేలిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ రోజు సాయంత్రమే తన పదవికి రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. ఓటమిని ఆయన అంగీకరించారు. కాగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. రేపు (ఆదివారం) కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా సీఎం పదవి కోసం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య మధ్య పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.

Untitled-15.jpg

12:15 PM: ఈసీ అధికారిక డేటా విడుదల.. అసలు గణాంకాలు ఇవే..

కర్ణాకట ఎన్నికల ఫలితాలకు సంబంధించి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న డేటాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాంగ్రెస్ 121 నియోజకవర్గాల్లో, బీజేపీ 72 చోట్ల, జేడీఎస్ 24 చోట్ల, స్వతంత్రులు 2 స్థానాల్లో, ఇతరులు మరో 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారని ఈసీ వెబ్‌సైట్ డేటా పేర్కొంది.

Untitled-14.jpg

12:01 PM: ఇప్పటివరకు గెలుపులు

- చామరాజనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పుట్టరంగ శెట్టి గెలుపు

- హస్సన్‌లో జేడీఎస్ అభ్యర్థి స్వరూప్ 10 వేల ఓట్ల తేడాతో విజయం

- ధర్వాడ్ రూరల్‌లో కాంగ్రెస్ గెలుపు.

- మంగళూరు సౌత్‌లో వేదవ్యాస కామ్ విక్టరీ

- బళ్లారి రూరల్‌ నియోజకవర్గంలో శ్రీరాములు ఓటమి.

- దేవనగరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తండ్రీకొడుకులు విజయం సాధించారు. దేవనగరి సౌత్‌లో తండ్రి శమనూర్ శివశంకరప్ప, దేవనగరి సౌత్‌లో ఎస్ఎస్ మల్లికార్జున్ విజయం సాధించారు.

- శివమొగ్గలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మధు బంగారప్పు విక్టరీ సాధించారు.

11:44 AM: సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ నేత సిద్దరామయ్య స్పందించారు. ఫలితాల సరళిపై హర్షం వ్యక్తం చేశారు. మత రాజకీయాలకు కర్ణాటకలో చోటు లేదని ప్రజాతీర్పు ద్వారా స్పష్టమైందన్నారు. నడ్డా, అమిత్, మోదీ వంటి నేతలు ప్రచారం చేసినా కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కట్టారన్నారు. బీజేపీకి కాలం చెల్లిందని, అవినీతి ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు గద్దె దింపారని వ్యాఖ్యానించారు.

11:44 AM: కర్ణాటక హస్తగతం!

కర్ణాటక కాంగ్రెస్ పార్టీ హస్తగతమైనట్టు ఫలితాల సరళిని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 118 నియోజకవర్గాల్లో, బీజేపీ 75 సీట్లు, జేడీఎపం 24 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. లీడింగ్‌లో పెద్దగా మార్పు కూడా కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ చేరుకోవడం ఖాయమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

11:34 AM: ఇప్పటివరకు ఫలితాల సరళి ఇదీ..

కాంగ్రెస్ - 117- 43 శాతం ఓటు షేరు.

బీజేపీ - 71- 36 శాతం ఓటు షేరు.

జేడీఎస్- 28- 13 శాతం ఓటు షేరు.

ఇతరులు- 3- 8 శాతం ఓటు షేరు.

11:34 AM: కాంగ్రెస్‌కు భారీగా ఓటింగ్ శాతం

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కే పట్టం కట్టాలని ఓటర్లు నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటు షేరు 44.4 శాతంగా ఉంది. ఆ తర్వాత బీజేపీ 37.4 శాతంగా ఉంది. జేడీఎస్ 10.5 శాతంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం వెబ్‌సైట్ డేటా స్పష్టం చేసింది.

11:24 AM: విజయనగర్‌ నియోజవర్గంలో కాంగ్రెస్ గెలుపు. ఆనంద్ సింగ్ కొడుకు ఓటమి.

11:20 AM: కర్ణాటకలో తొలి ఫలితం వచ్చేసింది.. కుందాపుర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ విజయం సాధించారు.

11:15 AM: ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేసి డేటా ఇదే...

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే విషయం ఉదయం 11 గంటలకు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటాను బట్టి స్పష్టమైంది. ఈసీ డేటా ప్రకారం.. కాంగ్రెస్ 120 నియోజకవర్గాలు, బీజేపీ 69 సీట్లు, జేడీఎస్ 26 స్థానాల్లో, ఇతరులు 3 చోట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Untitled-12.jpg

10:58 AM: హుబ్లీ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్.

10:55 AM: కేజీఎఫ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ హవా..

కోలార్ జిల్లా కేజీఎఫ్ నియోజకవర్గంలో 8వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 18,997 ఓట్ల మెజారిటీతో కొనసాగుతోంది. కాంగ్రెస్‌కు 37,849 ఓట్లు రాగా.. బీజేపీకి 18,852 ఓట్లు వచ్చాయి.

10:40 AM: కోలాహలంగా ఏఐసీసీ కార్యాలయం..

కర్ణాటకలో విజయం దిశగా కాంగ్రెస్ పయనిస్తుండటంతో.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం కోలాహలంగా మారింది. ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యాలయానికి కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

10:34 AM: బళ్ళారి సిటీలో కాంగ్రెస్ లీడ్. కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి 2926 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:13 AM: హైదరాబాద్‌కు చేరిన కర్ణాటక రాజకీయాలు!

కన్నడనాట గెలిచే పార్టీపై ఇంకా సంపూర్ణ స్పష్టత రాకపోయినప్పటికీ అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి. హైదరాబాదులోని ప్రముఖ హోటల్స్‌‌లో రూమ్‌ల పెద్ద సంఖ్యలో బుకింగ్ అయినట్టు తెలుస్తోంది. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20 రూమ్‌లు, నోవాటెల్ హోటల్‌లో 20 రూమ్‌లను కర్ణాటక వ్యక్తులు బుక్ చేసినట్టు తెలుస్తోంది. మరిన్ని హోటల్స్‌లో బల్క్ బుకింగ్స్ జరిగినట్టు సమాచారం. కర్ణాటక, హైదరాబాద్‌కు సంబంధించిన వివిధ వ్యక్తుల పేర్లతో నిన్న బుక్ అయ్యాయి. ఎన్నికల ఫలితాలను బట్టి ఎమ్మెల్యేలను ఈ హోటళ్లకు తీసుకొస్తారని సమాచారం. ఏ పార్టీ నుంచి రూము బుక్ చేశారో తమకు సమాచారం లేదంటున్న హోటల్ యజమాన్యాలు.

09:53 AM: కర్ణాటక ట్రెండ్‌పై ఫుల్ క్లారిటీ!

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైన 2 గంటల తర్వాత ట్రెండ్‌పై స్పష్టత వచ్చింది. ఆరంభ ట్రెండ్స్‌లో కాంగ్రెస్-బీజేపీల మధ్య నువ్వా- నేనా అన్నట్టు హోరాహోరి కనిపించినా.. ప్రస్తుతం మేజిక్ ఫిగర్‌ కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ లీడ్‌లో కొనసాగుతోంది. 10 గంటల సమయంలో కాంగ్రెస్ 121 స్థానాల్లో, బీజేపీ 72 నియోజకవర్గాల్లో, జేడీఎస్ 26 స్థానాల్లో ముందంజలో నిలిచారు.

Untitled-11.jpg

09:36 AM: బళ్ళారి సిటీలో కాంగ్రెస్ లీడ్. కాంగ్రెస్ అభ్యర్థి నారా భరత్ రెడ్డి 1700 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

09:33 AM: సిద్ధరామయ్య కొడుకు సంచలన ప్రకటన...

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఇంకా పూర్తిస్తాయి స్పష్టత రాకముందే మాజీ సీఎం సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా నాన్నే సీఎం’ అని వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా మెజారిటీ సాధిస్తుంది. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉంది. బీజేపీని అధికారం నుంచి దూరం చేయడానికి మేం ఏం చేయడానికైనా సిద్ధం. కర్ణాటక ప్రయోజనార్థం మా నాన్నే ముఖ్యమంత్రి అవ్వాలి’’ అని అన్నారు.

Untitled-9.jpg

09:28 AM: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. సిగ్గావ్‌లో బీజేపీ క్యాంప్ ఆఫీస్‌కు చేరుకున్నారు. కాగా ఇదే క్యాంప్ ఆఫీస్‌ బిల్డింగ్‌ ఆవణలోకి పాము ప్రవేశించింది. సెక్యూరిటీ సిబ్బంది దీనిని జాగ్రత్తగా పట్టుకున్నారు.

09:20 AM: ఉదయం 9 గంటలకు ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన డేటా ప్రకారం... కాంగ్రెస్ 12 చోట్ల, బీజేపీ 8 స్థానాల్లో జేడీఎస్ 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి.

09:15 AM: 8 మంది మంత్రుల వెనుకంజ.

09:10 AM: మేజిగ్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్. ప్రస్తుతానికి బీజేపీ-కాంగ్రెస్ ఆధిక్యాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 114, బీజేపీ 84, జేడీఎస్ 20 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

Untitled-8.jpg

09:00 AM: కౌంటింగ్ మొదలైన గంట తర్వాత పరిస్థితిని గమనిస్తే బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ కాస్త ముందంజలో కనిపిస్తోంది. ఉదయం 9 గంటల సమయంలో కాంగ్రెస్ 109 స్థానాల్లో ముందంజలో. బీజేపీ 83 నియోజకవర్గాల్లో లీడ్‌లో ఉంది. ఇక జేడీఎస్ అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో లీడ్‌లో కొనసాగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్‌ను చేరుకుంటుందా? లేక బీజేపీ దూసుకెళ్తుందా? లేదా హంగ్ ఖాయమా ? అనే సందేహాలకు మరో గంట లేదా రెండు గంటల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిన్న రాత్రి సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న కుమారస్వామి ఫలితాల ట్రెండ్‌పై స్పందించారు. ఇప్పటివరకు తమను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. ప్రస్తుతానికి తనకు డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

Untitled-7.jpg

08:55 AM: వరుణ నియోజకవర్గంలో లీడ్‌లో దూసుకెళ్తున్న సిద్ధారామయ్య.

08:53 AM: బళ్లారిలో శ్రీరాములు ముందంజ. ఇక బళ్లారి రూరల్‌లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొదటి రౌండ్ ఫలితంలో కాంగ్రెస్ అభ్యర్థి నాగేంద్ర 500 పై చిలుకు ఓట్లతో లీడ్.

08:52 AM: ఉదయం హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సీఎం బసవరాజ్ బొమ్మై.

Untitled-6.jpg

08:50 AM: 100కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ. 83 స్థానాల్లో లీడ్‌లో ఉన్న బీజేపీ అభ్యర్థులు. మరోవైపు జేడీఎస్ అభ్యర్థులు 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు.

08:46 AM: చెన్నపట్నలో జేడీఎస్ అధినేత కుమారస్వామి వెనుకంజ. రామనగర నియోజకవర్గంలో కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి కూడా వెనుకంజ

08:44 AM: కనకపురలో డీకే శివకుమార్ ముందంజ

08:38 AM: ఈవీఎం ఓట్ల కౌంటింగ్ మొదలు.

Untitled-5.jpg

08:35 AM: కౌంటింగ్ మొదలైన అరగంట తర్వాత పరిస్థితి ఇదీ..

కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ మొదలైన అరగంట తర్వాత ఫలితాల సరళిపై ఒక స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ 82 స్థానాల్లో, బీజేపీ 66 చోట్ల, జేడీఎస్ 17 చోట్ల ముందంజలో ఉన్నాయి.

08:28 AM: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నిన్న రాత్రి సింగపూర్ నుంచి బెంగళూరు చేరుకున్న కుమారస్వామి ఫలితాల ట్రెండ్‌పై స్పందించారు. ఇప్పటివరకు తమను ఏ పార్టీ సంప్రదించలేదని చెప్పారు. ప్రస్తుతానికి తనకు డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.

Untitled-4.jpg

08:28 AM: కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.

Untitled-3.jpg

08:24 AM: ఆరంభ ట్రెండ్స్‌లో బీజేపీని అధిగమించిన కాంగ్రెస్.. ప్రస్తుతానికి కాంగ్రెస్ 49 స్థానాల్లో, బీజేపీ 43 చోట్ల, జేడీఎస్ 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

08:20 AM: ఆరంభ ట్రెండ్‌లో వెనుకబడ్డ కాంగ్రెస్.. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో లీడ్‌లో ఉన్నట్టు ట్రెండ్స్ వెలువడుతున్నాయి.

08:15 AM: బళ్లారిలో కాంగ్రెస్ ముందంజ

08:10 AM: కౌంటింగ్ ఆరంభ ట్రెండ్‌ని బట్టి కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా - నేనా అన్నట్టు ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 11, బీజేపీ 19, జేడీఎస్ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

08:00 AM : పోస్టల్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది.

* 224 నియోజకవర్గాల నుంచి 2,615 మంది అభ్యర్థులు

* గెలుపుపై ఎవరి ధీమా వారిదే..

* మేజిక్‌ ఫిగర్‌ 113 ఎవరిదో..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంలకు మొదలైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల పోటీలో ఎవరు గెలుస్తారు? ఎవరు అధికారం దక్కించుకుంటారు? విషయం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మరోవైపు, గెలుపుపై బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నేతలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే, ఇప్పటి వరకు వచ్చిన సర్వేలను పరిగణనలోకి తీసుకున్న నాయకులు ‘హంగ్‌’ వస్తే ఏం చేయాలన్న దానిపైనా అంతర్గత చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, ఏపార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకపోతే.. చక్రం తిప్పేందుకు జేడీఎస్‌ నేత, మాజీ సీఎంకుమారస్వామి కూడా సిద్ధంగా ఉండడం గమనార్హం. ఇదిలావుంటే, శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 36 కేంద్రాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Updated Date - 2023-05-13T17:04:23+05:30 IST