Minister Nageswara Rao : ఎన్టీఆర్ నాణెంపై కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-29T14:48:19+05:30 IST

ఎన్టీఆర్ వంద రూపాయిల నాణెం(NTR coin)పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Minister Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వంద రూపాయిల నాణాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది విడుదల చేశారు.

Minister Nageswara Rao :  ఎన్టీఆర్ నాణెంపై  కీలక వ్యాఖ్యలు

రాజమండ్రి: ఎన్టీఆర్ వంద రూపాయిల నాణెం(NTR coin)పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Minister Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వంద రూపాయిల నాణాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. మంగళవారం నాడు మంత్రి కారుమూరి రాజమండ్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీఆర్ మంచి నాయకుడు. చెల్లని నాణాన్ని ఏన్టీఆర్ పేరుతో విడుదల చేశారు. ప్రజల్లో చెల్లే నాణెం విడుదల చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆధార్ లింక్ చేసి దొంగ ఓట్లు తొలగిస్తున్నామని చెప్పారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న 151 జ్యూయలరీ దుకాణాలపై కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై టీడీపీ హయాంలో 21 కోట్ల జరిమానా విదిస్తే.. వైసీపీ పాలనలో 40 కోట్ల అపరాద రుసుం వసూలు చేసినట్లు తెలిపారు.నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై 1162 కేసులు నమోదు చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.

Updated Date - 2023-08-29T21:25:27+05:30 IST