Lokesh YuvaGalam: పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి

ABN , First Publish Date - 2023-08-29T16:06:13+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాసేపటి క్రితమే పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది.

Lokesh YuvaGalam: పోలవరం నిర్వాసితులతో లోకేశ్ ముఖాముఖి

ఏలూరు: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. కాసేపటి క్రితమే పోలవరం నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఇందులో భాగంగా పోలవరం నిర్వాసితులతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. నిర్వాసితుల కోసం నాలుగు వేల కోట్లు ఖర్చు చేసామని తెలిపారు. టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మోసానికి మరో రూపం సైకో జగన్ అంటూ విరుచుకుపడ్డారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.10 లక్షలు ఇస్తామన్నారని.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుఢు పోలవరం నిర్వాసితులకు అనేక హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక జగన్ చేతులెత్తేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కేంద్రం ఏమైనా ఇస్తేనే ఆయన బటన్ నొక్కుతున్నారని వ్యాఖ్యలు చేశారు. అప్పుడొక మంత్రిగారు ఉండేవారని.. బుల్లెట్ దిగిందా అని విమర్శలు చేసారని.. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ దిగిందంటూ ఎద్దేవా చేశారు. కనీసం నెల్లూరు టికెట్ వస్తుందో లేదో ఆయనకే తెలీదన్నారు. ఇప్పుడు ఉన్న మంత్రి గారు పోలవరం గురించి తనను అడగవద్దు అని అంటున్నారని లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-08-29T16:06:13+05:30 IST