Share News

JANASENA: యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తారు: రమేష్ బాబు

ABN , Publish Date - Dec 18 , 2023 | 10:59 PM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ ( Panchkarla Ramesh ) బాబు స్పష్టం చేశారు.

JANASENA: యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వస్తారు:  రమేష్ బాబు

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ ( Panchkarla Ramesh ) బాబు స్పష్టం చేశారు. సోమవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈనెల 20వ తేదీన జరగనున్న యువగళం ముగింపు సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద కనీవిని ఎరగని రీతిలో యువగళం ముగింపు సభ జరగనుంది. యువగళం ముగింపు సభ ద్వారా టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తారు. మూడు నెలలు తర్వాత రాష్ట్రంలో జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. యువగళం ముగింపు సభకు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలి’’ అని పంచకర్ల రమేష్ బాబు పిలుపునిచ్చారు.

Updated Date - Dec 18 , 2023 | 10:59 PM