Viveka Case: వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా

ABN , First Publish Date - 2023-10-04T12:29:09+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.

Viveka Case: వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా

హైదరాబాద్‌/అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Case) విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను సీబీఐ కోర్టు (CBI Court) ఈనెల 16కు వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy) కోర్టుకు వచ్చారు. అలాగే వివేకా హత్య కేసులో అరెస్ట్‌ అయిన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్‌లను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు.


మరోవైపు వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ కోర్టు అక్టోబర్ 10 వరకు పొడిగించింది. నిన్నటితో భాస్కర్‌రెడ్డి మధ్యంతర బెయిల్ ముగిసింది. తన ఆరోగ్యం కుదుట పడలేదని మరికొంత సమయం కావాలంటూ కోర్టును భాస్కర్‌రెడ్డి కోరారు. దీంతో భాస్కర్‌ రెడ్డికి మరో ఏడు రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్‌ను సీబీఐ కోర్టు మంజూరు చేసింది.

Updated Date - 2023-10-04T12:29:09+05:30 IST