Galla Jayadev: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్: పార్లమెంట్‌లో గల్లా జయదేవ్

ABN , First Publish Date - 2023-09-18T21:01:03+05:30 IST

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

Galla Jayadev: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్: పార్లమెంట్‌లో గల్లా జయదేవ్

ఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కాకుండానే అరెస్టు చేశారని అన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేశారని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రూ.371 కోట్లు పక్క దారి పట్టించారనేది ప్రధాన ఆరోపణగా ఉందని పేర్కొన్నారు. కానీ చంద్రబాబుకు డబ్బు అందినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని ఆయన తెలిపారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అభ్యర్థించారు.


పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా తన నోటి దూలను ప్రదర్శించారు. అందరూ చూస్తుండగానే రామ్మోహన్ నాయుడుపై నోరు పారేసుకున్నారు. రామ్మోహన్ నాయుడిని ఉద్దేశించి ‘‘కూర్చోరా.. కూర్చోరా బాబు’’ అంటూ హేళనగా మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు హస్తం ఉందని పార్లమెంట్‌లో మిధున్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే మిధున్ రెడ్డి చెప్పిన అబద్ధాలను రామ్మోహన్ నాయుడు ఖండించారు. దీంతో ఆగ్రహానికి గురైన మిధున్ రెడ్డి సహచర ఎంపీ అన్న కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుడా రామ్మోహన్ నాయుడిని ఏకవచనంతో సంబోధించారు. అయితే ఎంపీ రామ్మోహన్ నాయుడుపై మిధున్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు ఖండించారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుపై మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను పలువురు ఎంపీలు కూడా తప్పుబట్టారు. రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడుపై మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వారు ఖండించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని ఆయన కోరారు.

Updated Date - 2023-09-18T21:01:03+05:30 IST