Share News

K.Srinivasulu Reddy :నెల్లూరు నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిల్‌కు కోటంరెడ్డి సవాల్

ABN , First Publish Date - 2023-11-18T16:29:43+05:30 IST

నెల్లూరు నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ( MLA Anil Kumar Yadav )కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ( Kotam Reddy Srinivasulu Reddy ) సవాల్ విసిరారు.

K.Srinivasulu Reddy  :నెల్లూరు నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిల్‌కు  కోటంరెడ్డి సవాల్

నెల్లూరు: నెల్లూరు నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ( MLA Anil Kumar Yadav )కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ( Kotam Reddy Srinivasulu Reddy ) సవాల్ విసిరారు. శనివారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అనిల్ ఒక రౌడ ఆయన అనుచరులు కూడా రౌడీషీటర్లే. బ్రాందీ షాపులు వద్ద కోట్లాది రూపాయలు దండుకున్న నీచుడువి నువ్వు. మంత్రిగా నారాయణ నగరంలోని పలు అభివృద్ధి పనులుని 90 శాతం పూర్తిచేస్తే, మంత్రిగా పది శాతం పనులు పూర్తి చేయలేని అసమర్ధుడివి నువ్వు. నారాయణ మంచి వ్యక్తి అని నేను నా భార్యాబిడ్డలతో సహా వచ్చి ప్రమాణం చేస్తా. నువ్వు బ్రాందీ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయలేదని, భార్యతో సహా వచ్చి ప్రమాణం చేయగలవా’’ అని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సవాల్ విసిరారు.

Updated Date - 2023-11-18T16:29:51+05:30 IST