YuvaGalam: 82వ రోజుకు యువగళం పాదయాత్ర.. యువనేతను కలిసిన మాధవరం గ్రామస్తులు

ABN , First Publish Date - 2023-04-27T09:48:30+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

YuvaGalam: 82వ రోజుకు యువగళం పాదయాత్ర.. యువనేతను కలిసిన మాధవరం గ్రామస్తులు

కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara lokesh) యువగళం పాదయాత్రకు (Yuvagalam Padayatra) ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు ఘనస్వాగతాలు పలుకుతున్నారు. పలు సామాజిక వర్గాలు, రైతులు, అనేక సంఘాల ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో లోకేష్‌ను కలుస్తూ తమ సమస్యలను తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) వల్ల తాము ఎంత నష్టపోయామో లోకేష్‌కు తెలియజేస్తున్నారు. వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తూ.. ప్రతీ ఒక్కరి పట్ల జగన్ సర్కార్ అన్యాయంగా ప్రవర్తిస్తోంది అంటూ లోకేష్ మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీర్చుతామంటూ హామీ ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.

పాదయాత్ర ప్రారంభానికి ముందు తన కోసం వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు. ప్రతీరోజు సుమారు వెయ్యి మందితో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. తమ అభిమాన నేత ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంత్రాలయం నియోజవర్గంల మాధవరం విడిది కేంద్రం నుంచి 82వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. మధ్యాహ్నం మంత్రాలయంలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు.

మా ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి....

పాదయాత్రలో భాగంగా మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం మాధవరం గ్రామస్తులు యువనేత నారా లోకేష్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామంలో చెరకు అధికంగా పండిస్తున్నామన్నారు. చెరకు అమ్ముకోవడానికి కర్నూలులో ఎక్కడా షుగర్ ఫ్యాక్టరీలు లేవని తెలిపారు. ఫలితంగా రోడ్లపైనే చెరకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. నకిలీ విత్తనాల సమస్య అధికంగా ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ప్రాంతంలో సుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు నియంత్రించాలన్నారు. రైతులు పండించిన ప్రతిపంటకు మద్దతు ధర నిర్ణయించాలని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని లోకేష్‌కు వినతి చేశారు.

లోకేష్ మాట్లాడుతూ... పాదయాత్ర సమయంలో రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటానని చెప్పిన జగన్... అధికారంలోకి వచ్చాక ముఖం చాటేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాల విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అందేలా చర్యలు చేపడతామన్నారు. చెరకు రైతుల సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని లోకేష్ తెలిపారు.

Updated Date - 2023-04-27T09:53:46+05:30 IST