YuvaGalam: 71వ రోజుకు లోకేష్ యువగళం.. నేడు పత్తికొండ నియోజకవర్గంలోకి ఎంట్రీ

ABN , First Publish Date - 2023-04-15T09:34:42+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 71వ రోజుకు చేరుకుంది.

YuvaGalam: 71వ రోజుకు లోకేష్ యువగళం.. నేడు పత్తికొండ నియోజకవర్గంలోకి ఎంట్రీ

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara lokesh YuvaGalam Padayatra) 71వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం డోన్ నియోజకవర్గం పాదయాత్ర సాగుతోంది. శనివారం ఉదయం పొలిమేరమెట్ట క్యాంప్ సైట్ నుంచి లోకేష్ (YuvaGalam) 71 రోజు యువగళం పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ రోజు డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకొని పత్తికొండ నియోజకవర్గంలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగ సభలో యువనేత మాట్లాడనున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేష్‌ (Nara lokesh)ను కలచట్ల గ్రామస్తులు కలిశారు. డోన్ నియోజకవర్గం కలచట్ల గ్రామస్తులు యువనేత లోకేష్‌ (YuvaGalam Padayatra)ను కలిసి సమస్యలు విన్నవించారు. గ్రామంలో అంతర్గత రోడ్లను తవ్వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. గ్రామ చెరువును హంద్రీనీవా జలాలతో నింపాలని కోరారు. గ్రామంలో ఇళ్లు లేనివారికి పక్కా గృహాలు నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు.

దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ... సీఎం జగన్మోహన్ రెడ్డికి (CM Jaganmohan Reddy) దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధలేదని విమర్శించారు. టీడీపీ (TDP) హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం (TDP Government) అధికారంలోకి వచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు.

యువనేతను కలిసిన ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులు

అనంతరం యువనేతను డోన్ నియోజకవర్గం ఎస్.రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులు కలిసి సమస్యలు చెప్పారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామంలో నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి సీసీ రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని తెలిపారు. అప్పలు చేసి ఇళ్లు పూర్తిచేసుకున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులు ఇప్పించి, సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు.

యువనేత స్పందిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ పేదలపై కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో అసంపూర్తిగా నిలచిపోయిన సుమారు 2లక్షల ఇళ్లకు గత టీడీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఇళ్లనిర్మాణం పూర్తిచేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు అందజేస్తామని తెలిపారు. రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-04-15T09:54:19+05:30 IST