AP TDP: చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ టీడీపీ నేతలు జలదీక్ష

ABN , First Publish Date - 2023-10-07T16:27:17+05:30 IST

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు (Chandrababu) నిరసనగా మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ జల దీక్షలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర ఉన్న గోదావరి- కృష్ణా కలయిక దగ్గర

AP TDP: చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ టీడీపీ నేతలు జలదీక్ష

ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు (Chandrababu) నిరసనగా మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ జల దీక్షలో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర ఉన్న గోదావరి- కృష్ణా కలయిక దగ్గర బీసీ విభాగం సంఘాలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు జల దీక్ష చేపట్టారు. కృష్ణా నదిలో కృష్ణమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరా సారే సమర్పించారు. చంద్రబాబు త్వరితగతిన విడుదల కావాలని ఆకాంక్షించారు.

కొల్లు రవీంద్ర కామెంట్స్..

‘‘కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి పవిత్ర సంగమం చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు. గంగమ్మ తల్లి దీవెనలతో చంద్రబాబు తప్పకుండా బయటికి వస్తారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గానీ.. నదుల అనుసంధానం చేసే కార్యక్రమం సాధ్యం కాదు. అటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు చేశారు. కృష్ణా జలాలపై మనకున్న హక్కులను కోల్పోయాం. భవిష్యత్తు కాలంలో డెల్టా ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. భవిష్యత్ తరాలను సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి (Cm jagan). అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారు. సోమవారం చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. తెలుగు ప్రజలు వైఎస్. జగన్మోహన్ రెడ్డికి శాశ్వత సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.’’ అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమామహేశ్వర కామెంట్స్..

‘‘గోదావరి తల్లి నీళ్లను కృష్ణమ్మ తల్లిలో కలిపిన పవిత్రమైన ప్రాంతం ఇది. 30 టీఎంసీలు గోదావరి తల్లి ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాయి. నువ్వు ఎంత అసమర్థుడివో.. చేతగాని వాడివో అర్థం అవుతుంది. కృష్ణా జలాలపై 67 ఏళ్లగా మన హక్కులను మనం కాపాడుకుంటున్నాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లోబడి అపెక్స్ కౌన్సిల్లో జగన్మోహన్ రెడ్డి నోరు తెరవకపోవడం వల్ల.. నీ అసమర్ధత, చేతగానితనం వల్ల పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లోబడి కృష్ణా జలాలపై హక్కులను దారాదత్తం చేశారు. ప్రధానమంత్రికి రాసిన లేక కూడా ఢిల్లీ మీడియా ముందు పెట్టలేదు. ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన కృష్ణా జలాలపై మన హక్కులను కోల్పోతుంటే నోరు తెరవ లేకపోయారు. చంద్రబాబు జైలులో ఉండి కూడా కృష్ణా జలాలపై మన హక్కులను కాపాడండి. అందరూ కలిసి పోరాటం చేయండి ప్రతిపక్షాలను కలుపుకొని హక్కులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని చెప్పారు. ఢిల్లీలో మీడియా ముందుకు వచ్చి కూడా ముఖ్యమంత్రి మాట్లాడలేకపోయారు. ఈరోజు రాష్ట్రానికి వచ్చావు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పు జగన్.’’ అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-07T16:27:17+05:30 IST