MLC Elections: ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ABN , First Publish Date - 2023-03-23T10:09:04+05:30 IST

ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో..

MLC Elections: ఏపీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

అమరావతి: ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాల (MLA Kota MLC Elections)కు పోలింగ్ కొనసాగుతోంది. వెలగపూడి లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి (Narayana swamy), రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath), ఉషశ్రీ చరణ్ (Usha sri Charan), దాడిశెట్టి రాజా (Dadisetti Raja), ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు (Namburi Shankar Rao), మేకతోటి సుచరిత (Mekatoti Sucharita) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasadrao), మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి (Pamula Pushpa Srivani), ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja), కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathi) తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు (Dharmana Krishna dasu), ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి (G Srikanth Reddy), సామినేని ఉదయభాను (Samineni udayabhanu), పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ (Paravata Sri Purnachandra prasad), కోరముట్ల శ్రీనివాసులు (Koramutla Srinivasulu), వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamshi mohan) తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే..రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు ఓటు వేశారు.

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆది మూలపు సురేష్, ప్రభుత్వ విప్ కర్ణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే కోన రఘుపతి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated Date - 2023-03-23T13:58:55+05:30 IST