AP Minister: అన్ని సీట్లకు పోటీ చేసే దమ్ముందా.. పవన్‌కు కారుమూరి సవాల్

ABN , First Publish Date - 2023-03-15T10:29:33+05:30 IST

జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు.

AP Minister: అన్ని సీట్లకు పోటీ చేసే దమ్ముందా.. పవన్‌కు కారుమూరి సవాల్

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ (JanaSena Avirbhava Sabha)లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వ్యాఖ్యలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Minister Karumuri Nageshwar rao) స్పందించారు. బుధవారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ (Janasena Party)కి ఒక దశ దిశ ఉందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ అన్ని సీట్లకు పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్ విసారు. అన్ని సీట్లకు పోటీ చేయలేని పవన్ కళ్యాణ్... అవగాహన, దిశ, దశ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అస్తమానం కులాల గురించి పవన్ మాట్లాడతున్నారని... బీసీలకు అన్యాయం చేసిన చంద్రబాబు (Nara Chandrabu)కు జనసేనాని వంత పాడుతున్నారని మంత్రి మండిపడ్డారు.

రంగా హత్య కేసులో చంద్రబాబు (TDP Chief) హస్తం ఉన్నట్లు హరి రామజోగయ్య పుస్తకంలో రాశారన్నారు. మరి రంగాని చంపిన వాళ్లపై అనుకూలంగా మాట్లాడాలని తమ పార్టీ శ్రేణులకు సూచన చేస్తున్నారా అని ప్రశ్నించారు. రంగాని చంపిన వాళ్లను తమరు సమర్థిస్తారా అంటూ నిలదీవారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క రోడ్డు అయిన వేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ (CM Jagan) ప్రజలకు మంచి చేస్తుంటే ఆయనపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్‌ను తమ కుటుంబాల్లో ఒక బిడ్డలా, కొడుకులా భావిస్తున్నారని తెలిపారు. ‘‘మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేస్తారు. మీకు దమ్ముంటే 175 స్థానాలకు పోటీ చేస్తామని చెప్పండి’’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్ విసిరారు.

Updated Date - 2023-03-15T10:29:33+05:30 IST