AP Budget: ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన

ABN , First Publish Date - 2023-03-16T10:09:35+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభమయ్యాయి.

AP Budget:  ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న మంత్రి బుగ్గన

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Budget Session) మూడవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) ప్రశ్నోత్తరాలను వాయిదా వేశారు. అలాగే టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ఆపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister buggan Rajendranath Reddy) 2023- 24 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం నున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అటు శాసనమండలిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సిదిరి అప్పలరాజు మండలి ముందు ఉంచనున్నారు.

కేబినెట్ ఆమోదముద్ర...

ఈరోజు ఉదయం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2023 - 24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే 2023–24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదించింది. అంతుకుముందు 2023 - 24 వార్షిక బడ్జెట్‌తో గురునానక్ కాలనీలోని తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కు ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బయల్దేరి వెళ్లారు. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ సహా పలువురు అధికారులతో కలిసి బుగ్గన సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లోని తన ఛాంబర్‌లో బడ్జెట్ ప్రతులకు బుగ్గన, అధికారులు ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ...పేద ప్రజలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పరిపాలనా పరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు ఉంటాయన్నారు. ఉన్న పధకాలను బలపరిచేలా మరింత మందికి అవకాశం ఇచ్చేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.

Updated Date - 2023-03-16T10:24:05+05:30 IST