Share News

CPI Narayana : కేసీఆర్ అహంభావం, అహంకారమే ఈ ఓటమికి కారణం‌

ABN , First Publish Date - 2023-12-03T22:42:59+05:30 IST

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అహంకారంమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) వ్యాఖ్యానించారు.

CPI Narayana : కేసీఆర్ అహంభావం, అహంకారమే ఈ ఓటమికి కారణం‌

విజయవాడ: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అహంకారంమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణంమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ( CPI Narayana ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారమదంతో మాట్లాడిన వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక అండర్ స్టాండింగ్‌కు వచ్చాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో కేసీఆర్ తన కూతురిని కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాళ్ల మీద పడ్డాడు. అప్పటి వరకు కేసీఆర్‌పై ఫైట్ చేసిన బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి మార్చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే భావన ప్రజల్లో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించినందుకు నా అభినందనలు. ఇతర రాష్ట్రాల్లో ఇక్కడి ఫార్ములాను కాంగ్రెస్ అమలు‌ చేయలేక పోయింది. ఇక్కడ యువతకు ప్రాధాన్యత ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇతర రాష్ట్రాల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గుఠపాఠం నేర్చుకోవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బీఆర్ఎస్‌ను గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు’’ అని నారాయణ పేర్కొన్నారు.

కేసీఆర్ గెలుపునకు జగన్ అలా కృషి చేశాడు

‘‘గతంలో మహాకూటమికి ఓటు వేస్తే హైదరాబాద్‌కి‌ వీసా తీసుకెళ్లాలని వైఎస్సార్ ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు జగన్ అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు పోలీసు బలగాలను పంపి కేసీఆర్ గెలుపునకు కృషి చేశాడు. ఇదంతా ఎన్నికల నాటకం అని అందరికీ అర్ధం అయింది. డ్రామాలు ఆడిన జగన్ బాగానే ఉన్నాడు... కేసీఆర్‌కు ఓడిపోయారు. ఇంతకాలం జగన్‌కు నీటి అవసరాలు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. నీటిని అడ్డం పెట్టుకుని కుట్రలు చేయడం నీచమని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే. ఏపీలో తనకి లాభమని జగన్‌కి తెలుసు. జగన్ వంటి వారిపై పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. బీజేపీ విభజన చట్టం అమలు చేయకుండా మోసం చేసింది. అయినా మోదీ కాళ్ల దగ్గర బాంచన్ దొర అని పడుతున్నారు. మన హక్కుల కోసం పోరాటం చేయలేని దుస్థితిలో జగన్ ఉన్నాడు. జేబీ లక్ష్మీనారాయణ ‌వంటి వారు మేధావుల ముసుగులో ఏదో మాట్లాడతారు. జగన్ సీటు ఇస్తే వెళ్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓ ఊసరవెళ్లి. ప్రజలను మాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని నారాయణ ఎద్దేవ చేశారు.

Updated Date - 2023-12-03T22:43:00+05:30 IST