Viveka Case : కడపలో హాట్ టాపిక్‌గా వివేకా కేసులో 145 పేజీల సీబీఐ చార్జిషీటు..

ABN , First Publish Date - 2023-07-22T11:05:01+05:30 IST

మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులతో పాటు కడప జిల్లాను 145 పేజీల సీబీఐ చార్జిషీటు కలవరపరచింది. పులివెందులతో పాటు కడప ఉమ్మడి జిల్లాలోఎక్కడ చూసినా మరోసారి జనంలో వైఎస్ వివేకా హత్య కేసులో చర్చే జరుగుతోంది. వైఎస్ వివేకా హత్యకేసులో రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల్లో సీబీఐ చార్జిషీట్ హాట్ టాపిక్‌గా మారింది. సీబీఐ చార్జిషీట్‌లో కీలక వాంగ్మూలాలతో ఎవరిపాత్ర ఏంటని కుట్రలు బట్టబయలు చేయడంపై సర్వత్రా సీబీఐకి ప్రశంసల జల్లు కురుస్తోంది.

Viveka Case : కడపలో హాట్ టాపిక్‌గా వివేకా కేసులో 145 పేజీల సీబీఐ చార్జిషీటు..

కడప : మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులతో పాటు కడప జిల్లాను 145 పేజీల సీబీఐ చార్జిషీటు కలవరపరచింది. పులివెందులతో పాటు కడప ఉమ్మడి జిల్లాలోఎక్కడ చూసినా మరోసారి జనంలో వైఎస్ వివేకా హత్య కేసులో చర్చే జరుగుతోంది. వైఎస్ వివేకా హత్యకేసులో రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల్లో సీబీఐ చార్జిషీట్ హాట్ టాపిక్‌గా మారింది. సీబీఐ చార్జిషీట్‌లో కీలక వాంగ్మూలాలతో ఎవరిపాత్ర ఏంటని కుట్రలు బట్టబయలు చేయడంపై సర్వత్రా సీబీఐకి ప్రశంసల జల్లు కురుస్తోంది.

అటు కీలక వ్యక్తుల వాంగ్మూలాలు... ఇటు సాంకేతిక ఆధారాలతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు! వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరిన్ని కుట్రలు, వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో సీబీఐ మరో రెండో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. జూన్‌ 30న హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు 145 పేజీల సప్లిమెంటరీ చార్జిషీటును సమర్పించింది. అందులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. అదే సమయంలో... జగన్‌ సోదరి, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సహా పలువురి వాంగ్మూలాలు బయటికి వచ్చాయి. అన్నింటి సారాంశం ఒక్కటే... వివేకాను హత్య చేయించింది అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి! హత్యకు కుట్రపన్నింది దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి! 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అంతకుముందు, ఆ తర్వాత హత్యలోప్రత్యక్షంగా పాల్గొన్న నిందితులు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో ఎప్పుడెప్పుడు, ఎలా ‘టచ్‌’లో ఉన్నారో సీబీఐ తన చార్జిషీటులో వెల్లడించింది.

Updated Date - 2023-07-22T11:05:01+05:30 IST