Chandrababu Arrest: ప్రెస్‌మీట్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేసిన సీనియర్ మహిళా నేత

ABN , First Publish Date - 2023-09-13T04:27:37+05:30 IST

సీఎం జగన్‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేద ని, అందుకని గతంలో అభివృద్ధి చేసిన వారిపై దాడులకు దిగుతున్నారని మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి విమర్శించారు.

Chandrababu Arrest: ప్రెస్‌మీట్‌లో ఎక్కిఎక్కి ఏడ్చేసిన సీనియర్ మహిళా నేత

సీఎం జగన్‌కు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాలేదని, అందుకని గతంలో అభివృద్ధి చేసిన వారిపై దాడులకు దిగుతున్నారని మహిళా కమిషన్‌ మాజీ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి విమర్శించారు. మంగళవారం ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘జగన్‌వి విధ్వంసకర రాజకీయాలు. ప్రజా వేదిక విధ్వంసంతో ఆయన పాలన మొదలైంది. కేసులు, దాడులు, విధ్వంసాలతోనే ఆయన పాలన నడుస్తోంది. దానిలో భాగమే చంద్రబాబుపై కేసులు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు చిరు నవ్వుతో బయటకు వస్తా రు. దానిని ఆపలేరు’ అని ఆమె వ్యా ఖ్యానించారు. కాగా, మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో నన్నపనేని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

Updated Date - 2023-09-13T11:39:29+05:30 IST