Sharif: సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుంది
ABN , First Publish Date - 2023-09-22T18:55:30+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్(Sharif) వ్యాఖ్యానించారు.
ప.గో: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్(Sharif) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు, దాడులను బయటకు రానివ్వడం లేదు. సభలో తెలుగుదేశం సభ్యులపై దాడులకు పాల్పడడం దారుణం.చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఒక్క కేసు కూడా నిలవదు. సీఎం జగన్‌రెడ్డి నియంత ధోరణికి రాష్ట్రం అతలాకుతలం అయిపోతోంది. రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబుపై కేసు పెట్టారు. అధికారులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని షరీఫ్ పేర్కొన్నారు.