Kanna Lakshminarayana: జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే చంద్రబాబు అక్రమ అరెస్ట్

ABN , First Publish Date - 2023-10-10T21:00:23+05:30 IST

జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) అన్నారు.

Kanna Lakshminarayana: జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే  చంద్రబాబు అక్రమ అరెస్ట్

పల్నాడు: జగన్‌రెడ్డికి ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) అన్నారు. మంగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘జగన్ పాలనలో దోపిడి, అక్రమ కేసులు పెట్టటం తప్ప చేసింది ఏమీలేదు. గడప గడపకు కార్యక్రమానికి వచ్చే ఎమ్మెల్యేలను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదియాలి. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు ప్రజల్లో వస్తున్న ఆదరను తట్టుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారు. కేసీసిఆర్ గత ఎన్నికల్లో సహకరించాడని ఆంధ్రకు అన్యాయం చేస్తూ జగన్ సహకరిస్తున్నాడు. చంద్రబాబును ఎక్కువ రోజులు జైల్లో ఉంచేందుకు జగన్ కుట్ర చేస్తున్నారు. పసలేనీ కేసులు, ఆరోపణలతో చంద్రబాబు, లోకేష్‌ను ఇబ్బంది పెడుతున్నారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారాయణ, లోకేష్ లింగమనేనికి సంబంధం లేదు. కేసీఆర్‌తో కుమ్మక్కుయి జగన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాడు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో సరైన సాక్ష్యాలు లేవు. అరుతడి పంటకు సాగునీరు ఇస్తానని ఇంతవరకు మంత్రి అంబటి రాంబాబు పట్టించుకోలేదు. రాష్ట్రంలో రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేదు’’ అని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

Updated Date - 2023-10-10T21:01:25+05:30 IST