Share News

Gorantla Butchaiah: కాకాణి నీ సవాల్‌ని స్వీకరిస్తా.. ప్రజల మధ్య చర్చకు రెడీనా..?

ABN , First Publish Date - 2023-12-11T15:34:44+05:30 IST

కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు.

Gorantla Butchaiah: కాకాణి నీ సవాల్‌ని స్వీకరిస్తా.. ప్రజల మధ్య చర్చకు రెడీనా..?

అమరావతి: కోర్టులో ఫైళ్లను మాయం చేసి, కల్తీ మద్యం, అక్రమ ఇసుక రవాణా, సిలికాన్ దోపిడీలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ( Minister Kakani Govardhan Reddy ) మునిగి తేలుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Butchaiah Chowdary )విమర్శించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో గోరంట్ల మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయి నీకు లేదు. నీకు దమ్ము, ధైర్యముంటే రైతాంగం, వ్యవసాయానికి జగన్ రెడ్డి, మీ ప్రభుత్వం ఏం చేసిందో విజయవాడలో ప్రజల సమక్షంలో నిరూపిద్దామా కాకాణి అని సవాల్ విసిరారు. మించౌగ్ తుఫాన్ నష్ట పరిహారంగా ప్రభుత్వం తక్షణమే రైతులకు రూ.10వేలకోట్ల ఆర్థికసాయం అందించాలి. నాలుగున్నరేళ్లలో జగన్‌రెడ్డి, అతని ప్రభుత్వం వ్యవసాయ, సాగునీటి రంగాలకు ఏం ఒరగబెట్టిందో కాకాణి ఆధారాలతో నిరూపించాలి. టీడీపీ ప్రభుత్వం రైతాంగానికి, ఇరిగేషన్ రంగానికి ఏం చేసిందో, ఎంత ఖర్చుపెట్టిందో అంకెలు, ఆధారాలతో మేం నిరూపిస్తాం. టీడీపీ ప్రభుత్వం 7లక్షల కోట్ల బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.68వేల కోట్లు కేటాయించి, 24 ప్రాజెక్టులు పూర్తిచేసింది’’ అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి

‘‘11 లక్షల కోట్ల బడ్జెట్‌లో జగన్‌రెడ్డి సాగు నీటి, వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించి, ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. రాష్ట్ర రైతాంగంపై అప్పుల భారం ఎందుకు ఎక్కువైందో, వ్యవసాయరంగం ఎందుకు నిర్వీర్యమైందో కాకాణి సమాధానం చెప్పాలి. రైతులను, వ్యవసాయాన్ని జగన్‌రెడ్డి ఉద్ధరిస్తే రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వస్థానంలో ఎందుకుందో కాకాణి సమాధానం చెప్పాలి. వారానికి 11 మంది రైతుకూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఎన్సీఆర్బీ నివేదికపై కాకాణి ఏం సమాధానం చెబుతాడు.మిచౌంగ్ తుఫాన్ నష్టాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వమే భర్తీ చేయాలి. చంద్రబాబు రైతుల వద్దకు వెళ్తున్నాడని, జగన్‌రెడ్డి మొక్కుబడిగా తుఫాన్ ప్రాంతాలకు వెళ్లి బారీకేడ్ల మధ్య హల్‌చల్ చేశాడు తప్పితే రైతులకు ఎలాంటి భరోసా కల్పించలేదు.

జగన్‌రెడ్డి నీట మునిగిన పైర్లు చూడకుండా హెలికాఫ్టర్‌లో తిరిగితే రైతుల కష్టం, నష్టం ఎలా తెలుస్తాయి’’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

Updated Date - 2023-12-11T15:34:55+05:30 IST