AP NEWS: ఏపీలో బాలికలపై పెరుగుతున్న అత్యాచార ఘటనలు
ABN , First Publish Date - 2023-12-12T16:35:00+05:30 IST
ఏపీలో బాలికలపై అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించింది. 18 ఏళ్లలోపు బాలికలపై పెద్ద సంఖ్యలో అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని తెలిపింది. గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో 18 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి.
ఢిల్లీ: ఏపీలో బాలికలపై అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించింది. 18 ఏళ్లలోపు బాలికలపై పెద్ద సంఖ్యలో అత్యాచార ఘటనలు నమోదవుతున్నాయని తెలిపింది. గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో 18 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దేశంలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు నేరాలు గురించి వైసీపీ ఎంపీలు అడగడంతో కేంద్రం ఈ వివరాలు వెల్లడించింది. దేశంలోనే 18 ఏళ్లలోపు బాలికలపై అత్యాచార కేసుల్లో రెండో స్థానంలో ఏపీ ఉంది. ఇతర రాష్ట్రాలతో కన్నా ఏపీలో అత్యధిక కేసులు నమోదే కాకుండా ప్రతి సంవత్సరం ఘటనలు, కేసులు పెరుగుతున్నాయి.
2020లో 18 ఏళ్ల ఉన్న బాలికలపై అత్యాచార కేసులు 577 నమోదు కాగా 2021 లో 614 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏపీలో భారీగా మాదకద్రవ్యాలు గంజాయి వినియోగం పెరిగిపోతుంది. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ఎక్కువ వినియోగం తో పాటు ప్రతి సంవత్సరం మాదకద్రవ్యాలు వినియోగం ప్రత్యేకించి గంజాయి వినియోగం పెరుగుతుంది. లోక్‌సభ సాక్షిగా కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. వైసీపీ ఎంపీ అడగడంతో కేంద్ర హోంశాఖ ఈ వివరాలు వెల్లడించింది. 2020లో 1,06 ,042 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా 2021 లో 1,91,712 కేజీలు 2022 లో 1,69,201 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది.