Kanna laxminarayana: ‘జగన్‌వి అన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలే’

ABN , First Publish Date - 2023-03-31T13:19:45+05:30 IST

రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజుకు చేరుకుంది.

Kanna laxminarayana: ‘జగన్‌వి అన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలే’

అమరావతి: రాజధాని అమరావతి (AP Capital) కోసం రైతులు చేపట్టిన ఉద్యమం 1200 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP Leader Kanna Laxminarayana).. రైతుల దీక్షా శిబిరానికి చేరుకుని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ... ప్రస్తుత అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు అమరావతి కోరుకుంటున్నారన్నారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన జగన్ (AP CM Jaganmohan Reddy) రాష్ట్ర భవిష్యత్తును కట్ట గట్టి కృష్ణాలో పారేశారని విమర్శించారు. జగన్‌కు మూడు రాజధానులు కట్టాలని లేదని... కేవలం దేశంలోనే అత్యంత ధనికుడు అయిన నాయకుడు కావాలని... దానికి ఉదాహరణ ఇసుక పాలసి, రాజధాని అని చెప్పుకొచ్చారు. విశాఖ (Visakhapatnam) వడ్డించిన విస్తరిలా ఉందని... లా వుంది దోచుకోవడానికే విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో విజయనగరం వెళ్లిన సమయంలో మీ ప్రాంతానికి రాజధాని వస్తుందని చెప్పగా.. వాళ్ళు మాకు ఈ దోపిడీ తెచ్చే రాజదాని వద్దు అన్నారు’’ అని టీడీపీ నేత తెలిపారు.

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఇది నిరూపించారన్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమం అంతా బూటకమన్నారు. ఇచ్చేది చాక్లెట్... ఎత్తుకెళ్లేది నక్లెస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ (YCP) కార్యకర్తలు నాలుగేళ్లలో అసంతృప్తితో ఇళ్లకు పరిమితం అయ్యారన్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళకంటే ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారని మండిపడ్డారు. జగన్‌‌ను రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు ముందుందన్నారు. మూడు రాజధానులు అన్న రోజు... చీపురు పుల్ల కూడా జగన్ అమరావతి నుంచి తీసుకెళ్లలేరని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-31T13:19:45+05:30 IST