Share News

Nara Lokesh: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డీఐజీ రవి కిరణ్‌ తీరుపై ఆగ్రహం

ABN , First Publish Date - 2023-10-14T17:18:28+05:30 IST

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు.

Nara Lokesh: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డీఐజీ రవి కిరణ్‌ తీరుపై ఆగ్రహం

రాజమండ్రి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్‌ (DIG Ravi Kiran) ను టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రశ్నించారు. శనివారం నాడు చంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్‌ని నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓ పక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ.... ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని లోకేష్ నిలదీశారు. చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలని వైద్యుల సూచిస్తే.. ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కి పట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేశారు. లోకేష్ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పకుండా ములాఖాత్ సమయం అయిపోయింది వెంటనే వెళ్లాలని DIG రవి కిరణ్ దురుసుగా వ్యవహరించారని నారా లోకేష్ ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Updated Date - 2023-10-14T18:23:02+05:30 IST