YuvaGalamPadayatra: ఆర్య వైశ్యులను ఆదుకుంటాం... లోకేష్ భరోసా

ABN , First Publish Date - 2023-02-02T11:56:05+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర ఏడవరోజుల కొనసాగుతోంది.

YuvaGalamPadayatra: ఆర్య వైశ్యులను ఆదుకుంటాం... లోకేష్ భరోసా

చిత్తూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర (TDP National General Secretary LokeshYuvaGalam Padayatra) ఏడవరోజు కొనసాగుతోంది. రామాపురం ఎమ్మోస్ హాస్పిటల్ క్యాంప్ సైట్ నుంచి లోకేష్ పాదయాత్ర (LokeshPadayatra)మొదలైంది. ఇందులో భాగంగా ఆర్యవైశ్య సామాజికవర్గం (Arya Vaishya community) ప్రతినిధులతో టీడీపీ నేత (TDP Leader) భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వం (Jagan Government)వచ్చిన తరువాత ఆర్య వైశ్యులను భయబ్రాంతులకు గురిచేస్తోందని ప్రతినిధులు తెలిపారు. వైసీపీ నాయకుల (YCP Leaders)వేధింపులకు ఆర్య వైశ్యులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. వ్యాపారాలు ప్రశాంతంగా చేసుకోలేని స్థితి ఉందని.... జే ట్యాక్స్ కట్టలేక వ్యాపారాలు వదులుకుంటున్నామని ఆర్యవైశ్య సామాజివర్గం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై లోకేష్ స్పందిస్తూ... టీడీపీ (TDP) హయాంలో ఆర్య వైశ్యులకు పెద్ద పీట వేశామన్నారు. టీడీపీ హయాంలో ఆర్య వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశామని.. రూ.30 కోట్ల నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. 2014 నుంచి 2019 వరకూ మంత్రి, రాజ్యసభ, నలుగురు కార్పొరేషన్ చైర్మన్లు, 7 గురు మున్సిపల్ చైర్మన్లు, 5 గురు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పదవులు ఇచ్చామన్నారు. అందరికీ సమ న్యాయం టీడీపీ విధానమని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ ఆర్య వైశ్యులను వేధించలేదన్నారు. వైసీపీ పాలనలో ఆర్య వైశ్యులను వేధిస్తున్నారని.. జే ట్యాక్స్ (J-Tax) పేరుతో హింసించి చంపేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పరిపాలనలో కన్యకాపరమేశ్వరి ఆలయాల (Kanyakaparameshwari Temple)ని ధ్వంసం చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో ఆర్య వైశ్యులకు ఉన్న మంత్రి పదవి కూడా పీకేశారని తెలిపారు. కార్పొరేషన్‌కు కూడా నిధులు ఇవ్వడం లేదన్నారు. జగన్ చంపేసిన ఆర్య వైశ్య కార్పొరేషన్‌ను టీడీపీ అధికారంలోకి రాగానే యాక్టివేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్య వైశ్యులు ఆర్థికంగానూ, రాజకీయంగానూ ఎదిగేందుకు టీడీపీ అధికారం వచ్చిన వెంటనే ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఆర్య వైశ్యుల్లో ఉన్న పేదవారిని అన్ని విధాలా ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు.

సెల్ఫీవిత్ లోకేష్...

మరోవైపు పాదయాత్రను ప్రారంభించే ముందు సెల్ఫీవిత్ లోకేష్ (Selfie With Lokesh) కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రతి రోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి లోకేష్ (NaraLokeshYuvaGalam Padayatra)సెల్ఫీలు దిగుతున్నారు. యువనేత (YuvaGalamaPadayatra) ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-02T11:56:58+05:30 IST