AP Minister: రాయలసీమపై చర్చకు రండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్

ABN , First Publish Date - 2023-08-01T13:24:12+05:30 IST

రాయలసీమపై చంద్రబాబుకు మమకారం లేదని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు.

AP Minister: రాయలసీమపై చర్చకు రండి.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్

తిరుపతి: రాయలసీమపై చంద్రబాబుకు (TDP Chief Chandrababu naidu) మమకారం లేదని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు రాయలసీమ గుర్తొస్తోందన్నారు. రాయలసీమ ప్రజలు చంద్రబాబును గత ఎన్నికల్లో తిరస్కరించారని గుర్తుచేశారు. రాయలసీమలోని 52 స్థానాలకు మూడు స్థానాల్లోనే టీడీపీ (TDP) గెలిచిందన్నారు. రాయలసీమకు వైఎస్సార్, చంద్రబాబు, జగన్‌లు (AP CM Jagan reddy) ఏమి చేశారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు నికర జలాలు కేటాయించలేదన్నారు. సీఎం జగన్ తన జిల్లాలోని గండికోట నుంచి చిత్తూరు జిల్లాకు నీళ్ళు కేటాయించారని తెలిపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమలో ప్రాజెక్ట్ బాట చేపట్టడం హాస్యాస్పదమని వ్యాఖ్యలు చేశారు. హంద్రీ నీవా పనులు వైఎస్ రాజేఖరరెడ్డి హయాంలో 90 శాతం పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. సొంత నియోజకవర్గం కుప్పంలో హంద్రీ - నీవా నీళ్ళు ఇవ్వలేదన్నారు. మూడు నెలల్లో సిఎం జగన్ చొరవతో కుప్పంకు నీళ్ళు ఇవ్వనున్నామని తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వలేదు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-01T13:24:12+05:30 IST