Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?

ABN , First Publish Date - 2023-08-28T20:16:19+05:30 IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు...

Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) మరోసారి లండన్ పర్యటనకు (London) వెళ్తున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని కోరుతూ తెలంగాణ హైకోర్టులో (TS High Court) వైఎస్ జగన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijaya Sai Reddy) పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్-02న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును సీఎం కోరారు. దేశం విడిచి వెళ్ళరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో జగన్ కోరారు. అయితే.. జగన్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ కొంత సమయం కోరింది. జగన్ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి సీబీఐ (CBI) కోర్టు వాయిదా వేసింది. అయితే కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో అనేదానిపై అటు వైసీపీలో (YSR Congress) .. ఇటు జగన్ వీరాభిమానుల్లో (YS Jagan Fans) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


telangana-highcourt.jpg

నాకూ అనుమతివ్వండి!

ఇదిలా ఉంటే.. తనకు కూడా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో ఎంపీ కోరారు.యూకే, యూఎస్ఏ, జర్మనీ, దుబాయ్ సింగపూర్ పర్యటనకు సాయిరెడ్డి అనుమతి కోరారు. కాగా.. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం విజయసాయి విదేశాలకు వెళ్లనున్నారు. అయితే.. విజయసాయి రెడ్డి పిటిషన్‌‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది హైకోర్టు. అటు జగన్.. ఇటు విజయసాయి పిటిషన్‌లపై ఈ నెల 30 తారీఖున విచారణ జరగనుంది.

Vijayasai-Reddy.jpg

గతంలో వివాదం..?

కాగా.. 2022 మే-20న జగన్ దంపతులు లండన్‌ వెళ్లినప్పుడు వివాదం తలెత్తిన విషయం విదితమే. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు జగన్‌ ప్రత్యేక విమానంలో దావోస్‌కు వెళ్లారు. విమానంలో నేరుగా దావోస్‌ వెళ్లకుండా..లండన్‌ మీదుగా వెళ్లడం అప్పట్లో దుమారం రేపింది. సంపాదించిన డబ్బును దాచుకోవడానికే జగన్‌ లండన్‌ వెళ్లారంటూ రాజకీయపక్షాలు ఆరోపణలు చేశాయి. జగన్‌ దావోస్‌ వెళ్లి....రాష్ట్రానికి చెందినవారితోనే ఒప్పందాలు చేసుకున్నారని.. ఈ మాత్రానికే ప్రత్యేక విమానంలో వయా లండన్‌ వెళ్లాల్సిన అవసరం ఏమిటని నిలదీశాయి. 2019 నుంచి..ఏప్రిల్‌, మే నెలల్లో జగన్‌ లండన్‌ వెళ్లిరావడం ఆనవాయితీగా మారిపోయిందని, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా ప్రత్యేక విమానంలో వెళ్లడం వల్ల ఖజానాపై భారం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జగన్ పర్యటనపై ప్రతిపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి మరి.

CBI.jpg


ఇవి కూడా చదవండి


KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్


BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం


TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?


Updated Date - 2023-08-28T20:21:16+05:30 IST