ప్రియురాలితో కలిసి హోటల్లో గది తీసుకున్న యువకుడు.. మరుసటి రోజు ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు సిబ్బంది వెళ్లగా..

ABN , First Publish Date - 2022-11-09T21:23:36+05:30 IST

అతడికి అప్పటికే వివాహమైంది. అయినా మరో యువతిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో హోటళ్లో గది బుక్ చేసుకుని, ప్రియురాలిని తీసుకెళ్లాడు. ఉదయం వేసిన తలుపులు..

ప్రియురాలితో కలిసి హోటల్లో గది తీసుకున్న యువకుడు.. మరుసటి రోజు ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు సిబ్బంది వెళ్లగా..

అతడికి అప్పటికే వివాహమైంది. అయినా మరో యువతిని ఇష్టపడ్డాడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది. కుటుంబ సభ్యులకు తెలీకుండా ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఈ క్రమంలో హోటళ్లో గది బుక్ చేసుకుని, ప్రియురాలిని తీసుకెళ్లాడు. ఉదయం వేసిన తలుపులు మరుసటి రోజు వరకూ తీయలేదు. ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు హోటల్ సిబ్బంది వెళ్లగా.. తలుపులు మూసి ఉన్నాయి. ఎంత తట్టినా తీయకపోవడంతో బద్దలుకొట్టారు. లోపల సీన్ చూసి చివరకు అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

తల్లీకొడుకులు అయి ఉండి ఇదేం పని.. అచ్చం విజయ్ సినిమాల్లో చూపించినట్టుగానే..

ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) దుర్గ్ జిల్లా కోహ్కాకు చెందిన తపాషి బైన్(32) అనే యువతికి స్థానిక ప్రాంతానికి చెందిన అఫ్రోజ్ ఖాన్ (35)తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అఫ్రోజ్ ఖాన్‌కు అప్పటికి వివాహమైంది. అయినా అతన్ని ఇష్టపడింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మంగళవారం అప్రోజ్ తన ప్రియురాలితో కలిసి హోటళ్లో గది (Hotel rooms) అద్దెకు తీసుకున్నాడు. ఉదయం తలుపులు మూసుకున్న వారు రోజంతా తీయలేదు. బుధవారం హోటల్ సిబ్బంది.. ఫుడ్ ఆర్డర్ తీసుకునేందుకు వెళ్లారు. అయితే ఎంత తట్టినా వారు తలుపులు తీయలేదు.

ప్రియురాలితో కలిసి బయటికి వెళ్లిన యువకుడు.. అంతలో డీజే వాయించాలంటూ స్నేహితుడి నుంచి ఫోన్.. తీరా అక్కడికి వెళ్లగా..

దీంతో అనుమానం వచ్చి.. హోటల్ యాజమాన్యానికి తెలియజేశారు. తర్వాత అంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. గదిలో ప్రేమికులిద్దరూ ఉరికి వేలాడుతూ ఉండడం చూసి అంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తపాషి గతంలో అఫ్రోజ్‌పై అత్యాచార ఆరోపణలు చేసింది. ఈ కేసులో అతను 50రోజుల జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి గత కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు.

కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..

Updated Date - 2022-11-09T21:23:40+05:30 IST