అన్న పెళ్లి కోసం చెల్లెలి త్యాగం.. ఎందుకిలా చేశావ్ అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం..

ABN , First Publish Date - 2022-11-30T21:19:18+05:30 IST

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. సోదరి సంక్షేమం కోసం అన్న ఎంత తాపత్రయపడతాడో.. అన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చెల్లెళ్లు కూడా..

అన్న పెళ్లి కోసం చెల్లెలి త్యాగం.. ఎందుకిలా చేశావ్ అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం..

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధం మాటల్లో వర్ణించలేనిది. సోదరి సంక్షేమం కోసం అన్న ఎంత తాపత్రయపడతాడో.. అన్న క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చెల్లెళ్లు కూడా కంటికి కనపడిన దేవుళ్లందరినీ ప్రార్థిస్తుంటారు. ఈ అనుబంధానానికి గుర్తుగా ఎన్నో పాటలు కూడా వచ్చాయి. రాఖీ పండుగ రోజు అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టి మరీ.. వారి క్షేమాన్ని కోరుకుంటుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ చైనా యువతి తన సోదరుడి పట్ల చూపించిన ప్రేమను చూసి నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి చెల్లెలు ప్రతి ఒక్కరికీ ఉండాలంటూ ఆకాంక్షిస్తున్నారు.

Viral Video: పేరుకే వృద్ధుడు.. ఇతడి విన్యాసాలు చూశారంటే.. ఖంగుతింటారు..

చైనాలోని (China) అన్హుయ్ ప్రావిన్స్‌లో ఉంటున్న 33ఏళ్ల యువతి (young woman) ఒంటరిగా నివసిస్తోంది. ఈమె 12ఏళ్ల క్రితం చైనీస్ పాన్ కేక్‌ల వ్యాపారం ప్రారంభించింది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తుండడంతో.. ఆ డబ్బునంతా వృథా చేయకుండా ఇప్పటివరకూ పోగు చేసింది. అయితే ఇటీవల యువతి సోదరుడికి వివాహం (marriage) నిశ్చయమైంది. దీంతో ఆమె సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ ఆమె సంపాదన మొత్తాన్ని అన్న వివాహానికి ఖర్చు చేయాలని అనుకుంది. అనుకున్నదే తడవుగా తన సంపాదన మొత్తాన్ని వెచ్చించి.. సోదరుడికి 129 చదరపు మీటర్ల ఇల్లు, కారు, రెస్టారెంట్‌ని బహుమతిగా ఇవ్వడంతో పాటూ వివాహం కూడా ఘనంగా జరిపించింది.

Viral Video: పబ్లిక్ ప్లేస్‌లో యువతుల ఫైటింగ్.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజనం..

car.jpg

దీనిపై ఎందుకు ఇలా చేశావ్.. అని సన్నిహితులు ప్రశ్నించగా.. తన అన్న సంతోషమే అనకు ముఖ్యమని తెలిపింది. ప్రస్తుతం తన పెళ్లి గురించి ఆలోచన లేదని, తన సోదరుడి భవిష్యత్తే ముఖ్యమని చెబుతోంది. ఇదిలావుండగా, స్థానిక మీడియా వివరాల ప్రకారం.. చైనీసం సమాజం లింగ అసముల్యతతో పోరాడుతోంది. మగవారి కంటే ఆడవారి సంఖ్య తక్కువగా ఉంది. దీంతో యువకులకు వివాహాలు చేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక సంపాదన, ఉద్యోగం లేని వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కొన్నిసార్లు యువతులకు ఎదురు కట్నం ఇచ్చి వివాహాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిసింది. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని.. తాజాగా, అన్న పెళ్లి కోసం చెల్లెలు చేసిన త్యాగాన్ని చూసి నెటిజన్లు.. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మూడేళ్ల కూతురు అదృశ్యం.. పొలాల్లో దొరికిన మృతదేహం.. అత్యాచారం చేసి చంపేసినా రెండేళ్లుగా కదలని కేసు..!

Updated Date - 2022-11-30T21:19:18+05:30 IST

Read more